E-Paper
Advertisement

Central Cabinet in Farmers: రైతన్నలకు అదిరిపోయే గుడ్‌‌న్యూస్.. ధరలు భారీగా తగ్గాయోచ్..

Central Cabinet in Farmers: రైతన్నలకు అదిరిపోయే గుడ్‌‌న్యూస్.. ధరలు భారీగా తగ్గాయోచ్..
Advertisement

Central Cabinet in Farmers: నూతన ఏడాది ప్రారంభమైన తొలి రోజే దేశవ్యాప్తంగా రైతన్నలపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి, కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతన్నలకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.

కొత్త సంవత్సరంలో కేంద్ర కేబినెట్ సమావేశాన్ని జనవరి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ, హాజరు కాగా రైతన్నలకు సంబంధించిన పలు పథకాలపై సుదీర్ఘ చర్చ సాగింది. ఇప్పటివరకు రైతన్నలకు వర్తిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో, నష్టపరిహారాన్ని పెంచినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Advertisement

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రూ. 69515 కోట్ల రూపాయల లబ్ధికి కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది రైతన్నలకు, ఆర్థిక భరోసా కలగనుంది. కేంద్రం అందించే పంట నష్ట సాయంను 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు భాగస్వామ్యం అవుతుండగా, ఈశాన్య రాష్ట్రాలకు 90% మిగిలిన రాష్ట్రాలకు 50% కేంద్రం భరించనుంది. అంతేకాదు మరో శుభవార్తను సైతం కేంద్రం ప్రకటించింది. డీఏపీ ఎరువుల బస్తాలను కేవలం రూ. 1350 లకే అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ప్రధానంగా రైతన్నలు ఏ పంట సాగుచేసినా, డీఎపీ ఎరువులను అధికంగా వినియోగిస్తారు. డీఏపీ ఎరువులపై అదనపు భారంను కేంద్రం భరించాలని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించింది. డీఏపీ ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ. 3850 కోట్లను కేటాయించింది. 2014-24 వరకు ఎరువుల సబ్సిడీకి రూ. 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, 2024 లో మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 లక్షల కోట్ల తో 23 కీలక నిర్ణయాలను రైతుల కోసం కేంద్రం తీసుకుంది..

Advertisement

Also Read: Hyderabad City: పోలీసులకు టెస్ట్ పెట్టిన మద్యం ప్రియులు.. పాసయ్యారా? ఫెయిలయ్యారా?

మొత్తం మీద కేంద్రం ఎరువుల బస్తాల ధరలను తగ్గించడంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 ఏడాదిని రైతు సంక్షేమ ఏడాదిగా కేంద్రం నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర తొలి క్యాబినెట్ సమావేశంలో అన్నదాతల సమస్యలపై ప్రత్యేక చర్చ సాగిందన్నారు. భారతదేశానికి వెన్నెముక లాంటి రైతన్నలను ఆదుకునేందుకు కేంద్రం ఎప్పుడు ముందుంటుందని, అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ఏది ఏమైనా తొలి ఏడాది తొలి రోజు రైతన్నలపై కేంద్రం వరాల జల్లు కురిపించిందని చెప్పవచ్చు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×