E-Paper
Advertisement

Corona virus : కరోనాపై కేంద్రం హైఅలెర్ట్.. దేశవ్యాప్తంగా ఆస్పత్రిల్లో మాక్‌ డ్రిల్స్‌..

Corona virus : కరోనాపై కేంద్రం హైఅలెర్ట్.. దేశవ్యాప్తంగా ఆస్పత్రిల్లో మాక్‌ డ్రిల్స్‌..
Advertisement

Corona virus : ప్రపంచ దేశాలను కరోనా మరోసారి కలవర పెడుతోంది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంకా అనేక దేశాల్లో వైరస్ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తోంది.

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్‌ వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రస్తుత సన్నద్ధతపై మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. అలాగే రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు తమ దగ్గర ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల లభ్యతను పరిశీలిస్తున్నారు.

Advertisement

ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు, నిపుణులతో కరోనా పరిస్థితిపై చర్చించారు. కొవిడ్ నియమావళిని పాటించడం ఎంత ముఖ్యమో.. తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం అంతే ముఖ్యమని సూచించారు. అందరూ ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని కోరారు. రెండో బూస్టర్‌ డోసు పరిగణనలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో వైద్య నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్య సిబ్బందికి రెండో బూస్టర్ అందించాలన్నారు.

కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. కొవిడ్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొందుకు ఢిల్లీ ప్రభుత్వం ఔషధాల కోసం ముందస్తుగా రూ.104 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం మాస్క్‌ను తప్పనిసరి చేసింది. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. చాలా రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను మళ్లీ అమల్లోకి తెచ్చారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ పైనా దృష్టిపెట్టాయి. కరోనా నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తిరుపతిలో నిర్వహించే జల్లికట్టను నిషేధించింది. ఏటా సంక్రాంతి సమయంలో ఇక్కడ జల్లికట్టు ఆడతారు. ఇలా చాలా రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వైద్యసౌకర్యాల పెంపుపై దృష్టిపెడుతున్నారు. కరోనా వైరస్ కేసుల మళ్లీ పెరిగినా ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×