E-Paper
Advertisement

SpiceJet : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ.. స్పైస్‌జెట్‌ ప్రత్యేక ఆఫర్..

SpiceJet : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. జనవరి 22 నుంచి 28 మధ్య బుక్‌ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా కనిష్ఠంగా రూ.1,622 నుంచే టికెట్ల ధరలు ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలన్నింటికీ (వన్‌-వే) ఈ సేల్‌ వర్తిస్తుందని పేర్కొంది.

స్పైస్‌మ్యాక్స్‌, యూఫస్ట్‌ వంటి యాడ్‌-ఆన్‌లు సహా సీట్ల ఎంపిక ఛార్జీలపై అదనంగా 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్నవారు విమానం బయలుదేరడానికి 96 గంటల ముందు వరకు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ఈ ఆఫర్ జనవరి 28 వరకే వర్తిస్తుంది. ప్రయాణికులు జనవరి 22 నుంచి 2024 సెప్టెంబర్‌ 30 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ముంబయి-గోవా, గువాహటి-బాగ్‌డోగ్రా, ఢిల్లీ-జైపుర్‌ వంటి ప్రముఖ మార్గాల్లో కనిష్ఠ ధర అయిన రూ.1,622 వర్తించనుంది.

Advertisement

అయోధ్యకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చడంలో భాగంగా స్పైస్‌జెట్‌ ఇప్పటికే వివిధ నగరాల నుంచి ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక విమానాలను ప్రారంభించనుంది. ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని వేడుకకు హాజరవుతున్న వారి కోసం ఆదివారం ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఎం-సైట్‌, మొబైల్‌, యాప్‌, వెబ్‌సైట్‌, రిజర్వేషన్‌ కౌంటర్లు, ప్రత్యేక ట్రావెల్‌ ఏజెంట్ల వద్ద బుక్‌ చేసుకున్న అన్ని టికెట్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×