E-Paper
Advertisement

నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు, ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టు వంతు

నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు, ఇక  ఫాస్ట్ ట్రాక్ కోర్టు వంతు
Advertisement

NEET UG Paper Leak: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ కేసులో ఓ అంకం ముగిసింది. ఈ కేసులో సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులు ఎన్‌టీఏ‌లో నిపుణులు ఉండటంతో ఆసక్తికరంగా మారింది. ఎన్‌టీఏలో అవినీతి లేదని చెబుతూనే, పరీక్ష నిర్వహణ సమయంలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు ప్రస్తావించినట్టు సమాచారం.

నీట్ పేపర్ లీక్ కేసు- నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు దాదాపుగా పూర్తి అయ్యింది. దీనికి సంబంధించి 13 మందిపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. సమర్పించిన ఛార్జిషీట్‌ను విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో బుధవారం ప్రవేశపెట్టనుంది. దర్యాప్తు సమయంలో సీబీఐ 360 మంది సాక్షులను విచారించింది. 422 పత్రాలను, 43 వస్తువులను సాక్ష్యాలుగా పేర్కొనట్టు తెలుస్తోంది. ఈ పరీక్షకు సంబంధించి NTA లో అవినీతికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలియజేసింది.

Advertisement

సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు- పరీక్ష పత్రాన్ని లీక్ చేసినందుకు ప్రతిఫలంగా ఏ NTA కు చెందిన అధికారులు డబ్బు, ఇతర ప్రయోజనం పొందినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పినట్లు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవినీతి జరగలేదని చెబుతూనే, పరీక్ష నిర్వహణలో విధానపరమైన లోపాలు, నిర్లక్ష్యం కారణంగా ఈ పత్రాల లీకేజీ జరిగిందని నిర్ధారించిందట సీబీఐ.

అవినీతి లేదు.. కాకపోతే నిర్లక్ష్యం –నిర్లక్ష్యానికి పాల్పడినట్లు తేలిన అధికారులపై శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్టు అందులోని సారాంశం. చార్జిషీట్‌లో పేర్కొన్నట్టుగా 13 మంది నిందితులు ఉన్నారు. వారిలో యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభమ్ ఖైర్నార్, ధనంజయ్ లోఖండే, ప్రహ్లాద్ కులకర్ణి, తేజస్ హర్షద్ కుమార్ షా, డాక్టర్ మనోజ్ షిరూరే, శివరాజ్ రఘునాథ్ హ మోతేగావ్‌కర్, మనీషా సందర్‌వాల్, మనీషా వాఘ్‌వాల్ ఉన్నారు.

Advertisement

ఎన్టీఏకు చెందిన ముగ్గురు నిపుణులు-నిందితులంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అందులో ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణులున్నారు. మనీషా మంధరే-జీవశాస్త్రం, ప్రహ్లాద్ కులకర్ణి-కెమిస్ట్రీ, మనీషా సంజయ్ హవాల్దార్- భౌతికశాస్త్రానికి సంబంధించి ఉన్నారు. మిగిలినవారు ప్రశ్నపత్రం లీక్‌కు సహకరించడంలో పాత్ర పోషించారని అనుమానిస్తోంది.

ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ వంతు- వారంతా మధ్యవర్తులు, కోచింగ్ సంస్థల అధికారులు, లాతూర్-పూణేలోని సంస్థల అధ్యాపక సభ్యులున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ..  మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో సోదాలు చేసింది. డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ డివైస్‌లు, కీలక పత్రాలను చేసుకుంది.

ALSO READ: గుండు గీయించుకుంటే 15 వేలు.. విక్రమార్కుడి మూవీ సీన్ రిపీట్, ఇంతకీ ఎక్కడ?

కేసు నమోదైన కొద్ది వారాల్లో లీక్ మొదలు లబ్ధిదారుల వరకు వెనుక ఎవరెవరు ఉన్నారనేది అంతా వెలికి తీసింది. ఇదే క్రమంలో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేసింది. కాకపోతే కొన్ని ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.  దర్యాప్తు ఛార్జీషీటు దాఖలు చేయడంతో ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ మొదలు పెట్టనుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×