E-Paper
Advertisement

CBI Raids Ex CM House: మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు, అసలేం జరిగింది?

CBI Raids Ex CM House: మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు, అసలేం జరిగింది?
Advertisement

CBI Raids Ex CM House: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో సీబీఐ బృందాలు రాయ్‌పూర్, భిలాయిలోని భూపేష్ బఘేల్ నివాసానికి వచ్చారు. నోటీసులు ఇచ్చి సోదాలు చేపట్టారు.

మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసమే కాకుండా ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ ఉన్నతాధికారి నివాసంపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సోదాలు ఏ కేసులో జరుగుతున్నాయో అనేది సీబీఐ అధికారులు ఇంకా వెల్లడించలేదు.

Advertisement

సోదాలపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ తనిఖీలు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బఘేల్‌, ఆయన కుమారుడు నివాసంలో ఈడీ సోదాలు చేసింది. ఆ సోదాల సమయంలో దాదాపు రూ.30 లక్షల నగదు, పలు రకాల పత్రాలను స్వాధీనం చేసుకుంది.

మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వచ్చేనెల 8, 9న జరగనున్న ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఉదయం 9 గంటకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగేసింది.  ప్రస్తుతం సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

ALSO READ: బీజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×