E-Paper
Advertisement

Rajasthan Express way Accident : రాంగ్ యూ టర్న్.. ట్రక్కు-కారు ఢీ.. ఆరుగురు మృతి

Rajasthan Express way Accident : రాంగ్ యూ టర్న్.. ట్రక్కు-కారు ఢీ.. ఆరుగురు మృతి
Advertisement

Rajasthan Highway Accident : రాజస్థాన్ లోని ఢిల్లీ – ముంబై ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ట్రక్ రాంగ్ యూటర్న్ తీసుకుంటుండగా.. దాని వెనుకే ఉన్న కారు ట్రక్కును ఢీ కొట్టింది. ప్రమాదంలో మరణించినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.

సవాయి మాధోపూర్ జిల్లాలోని బనాస్ నది వంతెన సమీపంలో జరిగిన ప్రమాదం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో ట్రక్ డ్రైవర్ దే తప్పని స్పష్టంగా తెలుస్తోంది. ట్రక్కు, దాని వెనుక కారు వెళ్తుండగా.. ట్రక్కు అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంది. వేగంగా వెళ్తున్న కారు.. యూటర్న్ తీసుకుంటున్న ట్రక్కును ఢీ కొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకునేలోపే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Advertisement

Also Read : బాచుపల్లిలో తీవ్ర విషాదం.. గోడ కూలి ఏడుగురు దుర్మరణం, సీఎం దిగ్భ్రాంతి

ప్రమాదంలో మరణించినవారిని మనీష్ శర్మ, అనితా శర్మ, సతీష్ శర్మ, పూనమ్, సంతోష్, కైలాష్‌లుగా గుర్తించారు. సికార్ జిల్లా నుంచి రణతంబోర్‌లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరు చిన్నారులు జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని వెతికి పట్టుకుంటామని ఎస్పీ దినేష్ కుమార్ వెల్లడించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×