E-Paper
Advertisement

Businessman Pushed Waiter From Terrace: యూపీలో దారుణం.. ప్రీ వెడ్డిండ్‌ ఫంక్షన్‌లో వెయిటర్ ను టెర్రస్‌పై నుంచి తోసిన బిజినెస్‌మేన్!

Businessman Pushed Waiter From Terrace: యూపీలో దారుణం.. ప్రీ వెడ్డిండ్‌ ఫంక్షన్‌లో వెయిటర్ ను టెర్రస్‌పై నుంచి తోసిన బిజినెస్‌మేన్!
Advertisement

Businessman Pushes Hotel Waiter from Terrace in Uttar Pradesh: ఫ్రెండ్స్‌తో ప్రీ వెడ్డింగ్ పార్టీ అంటే ఆ మజాయే వేరు. అప్పటివరకు అందరూ నవ్వుతూ పలకరించుకుంటూ ఎంజాయ్ చేశారు. అయితే యువకుల మధ్య మాటలు కాస్త తీవ్రమయ్యాయి. చివరకు ఫైటింగ్ దారి తీసింది. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు.. ఈలోగా బిజినెస్‌మేన్ వచ్చి యువకుడ్ని మేడపై నుంచి కిందకు తోసిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్‌లో బరిలీలోని ఓ ఫైవ్ స్టార్ హొటల్ వేదికైంది. వరుడు ఫ్రెండ్ రిదిమ్ అరోరా.. అదే హోటల్‌కు వచ్చిన మరో యువకుడు సార్థక్ అగర్వాల్ మధ్య చిన్నపాటి మాటలు కాస్త వాగ్వాదానికి దారితీశాయి. అనంతరం ఒకరిపై మరొకరు కొట్టుకున్నారు. రిదిమ్ తన ఫాదర్‌, బిజినెస్‌మేన్ అయిన సంజీవ్ అరోరాకు ఫోన్ చేసి జరుగుతున్న తతంగాన్ని చెప్పాడు  వెంటనే ఆయన ఘటన జరుగుతున్న ఫైవ్ స్టార్ హోటల్‌కి వచ్చారు.

Advertisement

Also Read: 2 Men Raped Beggar: మూసాపేట్ లో దారుణం.. భిక్షాటన చేసే మహిళపై రెచ్చిపోయిన కామాంధులు!

ఈలోగా అక్కడికి చేరుకున్న రిదిమ్ తండ్రి ఆ సన్నివేశాన్ని చూసి నియంత్రణ కోల్పోయాడు. వెంటనే సార్థక్ అగర్వాల్‌పై దాడి చేసి హోటల్ టెర్రస్ పైనుంచి కిందకు తోసేశారు. మరో యువకుడిపైనా ఆయన దాడి చేశారు. కిందపడిన సార్థక్ అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ యువకుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందరూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు చెబుతున్నమాట. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Advertisement

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×