E-Paper
Advertisement

UP: అత్తవారింటికి రాను.. వరుడికి షాకిచ్చిన వధువు

UP: అత్తవారింటికి రాను.. వరుడికి షాకిచ్చిన వధువు
Advertisement

UP: వివాహ వేడుక వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు వధువును అత్తవారింటికి సాగనంపారు. ఇంతలోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది వధువు. అత్తవారింటికి రాలేనని తేల్చి చెప్పేసింది. దీంతో వరుడి తరుపు వారంతా కంగుతిన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి వారణాసికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమయింది. ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి శనివారం వారి పెళ్లిని ఘనంగా చేశారు. ఆ తర్వాత అమ్మాయిని అత్తవారింటికి సాగనంపారు. పెళ్లికూతురుతో కలిసి వరుడు కారులో రాజస్థాన్ బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక.. వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు.

Advertisement

ఒక్కసారిగా కారు ఆపాలని అనడంతో.. ఏమైందో అర్థంకాక ఆపేశారు. ఇంతలోనే వధువు కారు దిగి కన్నీరు పెట్టుకోవడం మొదలు పెట్టింది. ఏమైందని అడగగా.. తనకు అత్తవారింటికి వెళ్లడం ఇష్టం లేదని.. తిరిగి వారణాసికి వెళ్లిపోతానని తేల్చి చెప్పింది. వాళ్లు ఎంత నచ్చజెప్పినా కూడా వినలేదు.

ఇంతలోనే పెట్రోలింగ్‌కు వెళ్తున్న పోలీసులు వాళ్లను గమనించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జరిగిన విషయం అంతా తెలుసుకొని అమ్మాయితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆమె వినకపోవడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి వారణాసికి పంపించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×