E-Paper
Advertisement

Earthquake: షాకింగ్.. బంగాళాఖాతంలో భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే..

Earthquake: షాకింగ్.. బంగాళాఖాతంలో భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే..
Advertisement

Earthquake Today: బంగాళాఖాతంలో ఊహించని పరిణామం జరిగింది. పొద్దు పొద్దున్నే సముద్రంలో అలజడి మొదలయ్యింది. ఉదయం 7.26 గంటలకు సముద్ర గర్భంలో భూకంపం సంభించింది.  రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం ఏర్పడిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS)  ప్రకటించింది. 35 కిలో మీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపంతో ప్రస్తుతం ఎలాంటి ముప్పులేదని, ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. తీవ్రత పెరిగితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గత నవంబర్ 21న హిందూ మహా సముద్రంలోనూ ఇలాగే భూకంపం సంభవించింది. అప్పట్లో భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. అప్పట్లో డెప్త్ కేవలం 10 కిలో మీటర్లుగానే ఉంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం

Advertisement

అటు సోమవారం సాయంత్రం హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. పలు ప్రాంతాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 3.2గా నమోదు అయ్యింది. రాత్రి 9:22 గంటల ప్రాంతంలో సోనీపట్ ప్రాంతంలో 5 కి.మీ. లోతులో కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అటు నేపాల్‌లోనూ ఆదివారం స్వల్ప భూకంపం ఏర్పడింది. సూదూర్ పశ్చిమ్ ప్రావిన్సు లోని బజాంగ్ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.4గా నమోదయ్యింది.

Read Also: మీకు తెలుసా? కోడి కూడా డైనోసారే.. ఇవిగో దాని ఫ్యామిలీ డిటైల్స్!

దక్షిణాసియాలో ఇటీవల వరుస భూకంపాలు

Advertisement

దక్షిణాసియాలో గత కొద్ది కాలంగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా (మంగళవారం) తజికిస్తాన్‌ లో 75 కి.మీ లోతులో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.  ఈ భూకంపంపై నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ కీలక ప్రకటన చేసింది. ఇదే ప్రాంతంలో నవంబర్ 26న 90 కి.మీ లోతులో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. డిసెంబర్ 1న మరో రెండు భూకంపాలు నమోదయ్యాయి. సోమవారం తెల్లవారుజామున టిబెట్ లోనూ భూకంపం సంభవించినట్లు తెలిపింది.  50 కి.మీ లోతులో 3.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ప్రకటించింది.

Read Also: పాము కాటేసిందని వేలు కట్ చేసుకున్నాడు.. డాక్టర్ చెప్పింది విని బుర్ర బాదుకున్నాడు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×