E-Paper
Advertisement

Brahmanandam : ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. బీజేపీ అభ్యర్ధికి మద్దతు

Brahmanandam : ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. బీజేపీ అభ్యర్ధికి మద్దతు
Advertisement

Brahmanandam : బ్రహ్మానందం కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా సర్‌ప్రైజింగ్ న్యూసే. కర్నాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగబోతోంది. సో, టైం దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా కర్నాటక బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. చిక్కబల్లాపూర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సుధాకర్‌తో బ్రహ్మానందానికి మంచి రిలేషన్స్ ఉన్నాయంటున్నారు. పైగా చిక్కబల్లాపూర్‌లో తెలుగు ఓటర్లు ఎక్కువ. గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నార. అందుకే, ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగు సినీ స్టార్లు ఎన్నికల ప్రచారం చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో, ఈసారి సుధాకర్ రిక్వెస్ట్ చేయడంతో… బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి బ్రహ్మానందం వెళ్లారు. అయితే, ఎన్ని రోజులు ఇలా ఎలక్షన్ క్యాంపైన్‌లో పాల్గొంటారనేది క్లారిటీ లేదు. మరోవైపు బ్రహ్మానందం ప్రచారానికి మంచి రెస్పాన్సే వస్తోందని చెబుతున్నారు. ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసి బ్రహ్మానందం.. ఇలా జనం మధ్యకు వెళ్లడంతో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.

కర్నాటక ఎన్నికల్లో హీరో హీరోయిన్ల ప్రభావం ఎక్కువే. ఈ మధ్యే కిచ్చ సుదీప్‌ను రంగంలోకి దింపింది బీజేపీ. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని దారుల్లో వెళ్తోంది. నిజానికి ఈ ఎలక్షన్స్‌లో ఎన్టీఆర్‌తోనూ ప్రచారం చేయించాలనుకుంది బీజేపీ. మొన్న అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ యూనిట్‌ను అభినందించారు కూడా. అంతకు ముందు కూడా ఎన్టీఆర్‌ను పిలిపించుకుని మరీ మాట్లాడారు అమిత్ షా. ఎన్టీఆర్ తల్లిది కర్నాటకనే. సో, ఆ ఎఫెక్ట్ ఉంటుందని భావించారు. కాని, కర్నాటక ఎన్నికల ప్రచారంలో మాత్రం వేలుపెట్టలేదు యంగ్ టైగర్.

Advertisement

సినిమా స్టార్లు ఎన్నికల ప్రచారంలో కనిపించడం కొత్తేం కాదు. పరిచయాలో, ప్యాకేజో.. కారణం ఏదైతేనేం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటారు. ఈ లిస్టులో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా చేరిపోయారు. 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×