E-Paper
Advertisement

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో బాంబ్‌ బ్లాస్ట్‌.. స్పాట్‌లో 37 మంది!

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో బాంబ్‌ బ్లాస్ట్‌.. స్పాట్‌లో 37 మంది!
Advertisement

Jammu Kashmir: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనను మరువక ముందే.. జమ్మూ కశ్మీర్‌లో మరో బాంబ్ బ్లాస్ జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ 30 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఎక్కువగా పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఉన్నారని సమాచారం.

300 అడుగుల దూరంలో దొరికిన శరీర భాగాలు..
పేలుడు దాటికి శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 300 అడుగుల దూరంలో కొన్ని శరీర భాగాలు గుర్తించారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రమాదవశాత్తు జరిగిన పేలుడా.. ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా..
ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగిన పేలుడని అధికారులు మొదట ప్రాథమిక నివేదికనిచ్చారు. ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను, నమూనాలను పరిక్షిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్న 360 కిలోల రసాయనాలు పేలినట్లు తెలుస్తుంది.

భారీగా ఎగసిపడ్డ మంటలు..
భారీ పేలుడుతో పోలీస్‌ స్టేషన్‌ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటుచేసుకోవడంతో రెస్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది.

Advertisement

ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఈడీ కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. ఈ బ్లాస్ట్‌కు జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ PAFF ఇప్పటికే బాధ్యత తీసుకుంది.

అక్టోబర్‌లోనే నౌగామ్‌లో ఉగ్రకదలికలను గుర్తించారు. బెదిరింపు పోస్టర్లు అంటించిన ఘటనపై ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది. సీసీటీవీ ఆధారంగా ముగ్గురు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్ అనే వ్యక్తి పాత్ర ఉందని తేలింది. తర్వాత ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేసి 360 కిలోల అమోనియం నైట్రేట్‌తోపాటు ఐఈడీ తయారీకి వినియోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పుల్వామాకు చెందిన మరో డాక్టర్‌ను గుర్తించి 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటికి ఈ బ్లాస్ట్‌తో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×