E-Paper
Advertisement

BJP vs AAP: కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్.. అందులో ఉన్నది ఇదే!

BJP vs AAP: కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్.. అందులో ఉన్నది ఇదే!
Advertisement

కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్
ఆప్ ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలే
కేజ్రీవాల్ అవినీతికి కొత్త ప్రమాణాలు తీసుకొచ్చారు
అవినీతి కాలుష్యం నుంచి ఢిల్లీని కాపాడుదాం
ఆప్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన బీజేపీ
ఛార్జిషీట్ విడుదల చేసిన ఢిల్లీ ప్రధాన ప్రతిపక్షం
బీజేపీకి ఎలాంటి అజెండా లేదన్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ, స్వేచ్ఛ: BJP vs AAP: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆప్ సర్కారు, కేజ్రీవాల్ లక్ష్యంగా బీజేపీ చార్జిషీట్‌‌ విడుదల చేసింది. కేజ్రీవాల్ అవినీతి కాలుష్యం నుంచి ఢిల్లీని రక్షించాలని ఓటర్లను కోరింది. గతంలో అన్నా హజారేను ముందుపెట్టి కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన కేజ్రీవాల్.. నేడు అవినీతికి కొత్త ప్రమాణాలను తీసుకొచ్చారంటూ ఆరోపణలు గుప్పించింది. ఢిల్లీలోని పాఠశాలలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని, కానీ ఏకంగా 2 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని బీజేపీ ఆరోపించింది.

Advertisement

ఢిల్లీలో 24 గంటలపాటు మంచినీరు సరఫరా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది, కానీ ఢిల్లీ జనమంతా ట్యాంకర్ల ద్వారా నీటిని డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ విమర్శించింది. ఢిల్లీలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోందని, దీనికి ఆప్ ప్రభుత్వ విధానాలే కారణమని నిందించింది. యమునా నదిని శుద్ధి చేయటంలో కేజ్రీవాల్ విఫలమయ్యారంటూ బీజేపీ ఆరోపించింది. అందరికీ మంచినీరు అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘జల్ జీవన్ మిషన్’కు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. కేజ్రీవాల్ హయాంలో వాటర్ బోర్డు కుంభకోణం, క్లాస్ రూమ్ కుంభకోణం, మొహల్లా క్లినిక్ కుంభకోణం, వక్ఫ్ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, డీటీసీ కుంభకోణం ఇలా ఎన్నో స్కామ్‌లు జరిగాయని మండిపడింది.

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఐడియా.. వారి లైఫ్ ని మార్చేసింది!

Advertisement

బీజేపీకి అజెండా లేదు: కేజ్రీవాల్
బీజేపీ విడుదల చేసిన ఛార్జిషీటుపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ విషయంలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదని, ఆ పార్టీకి కనీసం సీఎం అభ్యర్థి కూడా లేరని మండిపడ్డారు. తనను ఏవిధంగా వేధించాలనే విషయం మాత్రమే బీజేపీకి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేవారు. కాగా, కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకున్న విషయం తెలిసిందే

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×