E-Paper
Advertisement

వివక్షపై వినూత్న నిరసన.. గుండు గీయించుకున్న బీజేపీ మహిళా కౌన్సిలర్!

వివక్షపై వినూత్న నిరసన.. గుండు గీయించుకున్న బీజేపీ మహిళా కౌన్సిలర్!
Advertisement

Firozabad: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓక వింతైన, తీవ్రమైన నిరసన చోటుచేసుకుంది. అధికార బీజేపీకే చెందిన మహిళా కౌన్సిలర్ ఉషా దేవి తన వార్డుపై వివక్ష చూపిస్తున్నారంటూ కార్పొరేషన్ కార్యాలయం ముందే నిరసనకు దిగారు. అంతటితో ఆగకుండా.. అందరూ చూస్తుండగానే అక్కడ కూర్చొని గుండు గీయించుకోవడం స్థానికంగా తీవ్ర సంచలన సృష్టించింది.

వార్డు నంబర్ 51 కౌన్సిలర్‌గా ఉన్న ఉషా దేవి మాట్లాడుతూ.. తన పరిధిలోని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస అభివృద్ధి పనులను కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మేయర్ భర్త జోక్యం చేసుకుంటూ తన వార్డుకు నిధులు రాకుండా వివక్ష చూపిస్తున్నారని, దీనివల్ల ప్రజలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ అవమానాన్ని తట్టుకోలేక నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Advertisement

అయితే, ఈ వ్వవహారంపై మున్సిపల్ కమిషనర్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డులకు సమానంగానే నిధులు కేటాయిస్తున్నామని, ఎక్కడా వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ కౌన్సిలరే ఇలా మున్సిపల్ ఆఫీస్ ముందు గుండు గీయించుకోవడంతో ఈ ఉదంతం కాస్తా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: యూపీలో కలకలం.. అత్యాచార నిందితుడికి పూలదండలు, భుజాలపై ఊరేగింపు!

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×