E-Paper
Advertisement

Sonia Gandhi: కర్నాటక ‘సార్వభౌమత్వం’.. సోనియాగాంధీపై ఎఫ్‌ఐఆర్‌కు బీజేపీ డిమాండ్..

Sonia Gandhi: కర్నాటక ‘సార్వభౌమత్వం’.. సోనియాగాంధీపై ఎఫ్‌ఐఆర్‌కు బీజేపీ డిమాండ్..
Advertisement

Sonia Gandhi: ఛాన్స్ దొరికితే చాలు బీజేపీ చెలరేగిపోతోంది. కర్నాటక ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. బజరంగ్ దళ్‌పై నిషేధ వివాదాన్ని ఎంతగా రాజకీయం చేసిందో చూశాం. ఇప్పుడు నేరుగా సోనియాగాంధీనే టార్గెట్ చేశారు కమలనాథులు. అందుకు, ఆమె చేసిన కాంట్రవర్సీ ట్వీటే కారణం. కీలకమైన సమయంలో సోనియా కావాలనే అన్నారో తెలీదు కానీ.. బీజేపీ మాత్రం సోనియా ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఈసీకి ఫిర్యాదు చేసింది.

Advertisement

క‌ర్నాట‌క ప్ర‌తిష్ట‌, సార్వ‌భౌమ‌త్వానికి, స‌మ‌గ్ర‌త‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా కాంగ్రెస్ చూస్తుంది.. ఇందుకు భంగం కలిగించే వారిని ఎవరిని అనుమతించబోము.. అంటూ సోనియా పేరుతో ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది.

సార్వభౌమత్వం.. అనే పదంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బీజేపీ. సార్వభౌమత్వం అనేది భారత దేశానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రాలకు ఉండదు. మరి, సోనియా ఆ వ్యాఖ్యలు ఎలా చేసినట్టు? కర్నాటకను కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రాంతం/దేశంగా పరిగణిస్తోందా? ఇది రాజ్యాంగ విరుద్ధం.. ఎన్నికల సంఘం నియమనిబంధనలకు వ్యతిరేకం. ఇది విభజన, విచ్చిన్నకర రాజకీయం. తక్షణమే ఈ వ్యాఖ్యలు చేసిన సోనియాపై చర్యలు తీసుకోవాలంటూ విరుచుకుపడుతోంది బీజేపీ.

Advertisement

సోనియా గాంధీపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని బీజేపీ కోరింది. సోనియా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు బీజేపీ ఆరోపించింది. సార్వ‌భౌమ‌త్వం అన్న ప‌దాన్ని వాడ‌డం ప‌ట్ల బీజేపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఆ మేరకు ఈసీకి లేఖ రాసింది. సోనియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలని.. కాంగ్రెస్ పార్టీ అనుమతి రద్దు చేయాలంటూ.. ఈసీని డిమాండ్ చేసింది బీజేపీ.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×