E-Paper
Advertisement

MCD: చిత్తుచిత్తుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. ఢిల్లీలో డిష్యూం డిష్యూం..

MCD: చిత్తుచిత్తుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. ఢిల్లీలో డిష్యూం డిష్యూం..
Advertisement

MCD: కొట్టుకున్నారు. తన్నుకున్నారు. గుద్దుకున్నారు. నెట్టుకున్నారు. చొక్కాలు చించుకున్నారు. సిగలు పట్టుకుని పొట్లాడుకున్నారు. నానారచ్చ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్-MCD రణరంగంగా మారింది. ఆ దృష్యాలు చూస్తుంటే.. వీరా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లు అనిపిస్తోంది. స్ట్రీట్ ఫైట్ మాదిరి.. సభలో బీజేపీ, ఆప్ సభ్యులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు.

స్టాండిగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహణ ఇలా ముష్టియుద్ధానికి దారి తీసింది. అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లలేదని మేయర్‌ ప్రకటించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అడ్డుకుంటూ బీజేపీ సభ్యులు రెచ్చిపోయారు. ఏకంగా మేయర్ షెల్లి ఓబెరాయ్ పైనే దాడికి దిగారు. పోలీసులు ఆపుతున్నా ఆగలేదు. మెజార్టీ బీజేపీ, ఆప్ సభ్యులు ఘర్షణకు దిగడంతో.. కౌన్సిల్‌లో రచ్చ రచ్చ నడిచింది.

Advertisement

జై శ్రీరామ్‌, జై మోదీ అంటూ బీజేపీ సభ్యులు పెద్దగా నినాదాలు చేశారు. ఆప్ వర్గమేమో.. ‘ఆమ్‌ ఆద్మీపార్టీ జిందాబాద్‌.. అర్వింద్‌ కేజ్రీవాల్‌ జిందాబాద్‌’ అంటూ గొంతెత్తుకుంది. ఇలా సభ హోరెత్తిపోయింది.

పరస్పర దాడిలో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమంది బట్టలు చిరిగిపోయాయి. ఓ కౌన్సిలర్ మూర్చపోయి కిందపడిపోయారు.

Advertisement

ఎంసీడీ ఎన్నికల్లో ఆప్‌ 134 స్థానాలు గెలిచింది. తాజాగా ఒక ఆప్‌ సభ్యుడు బీజేపీలో చేరాడు. దీంతో ఆప్‌ బలం 133కు తగ్గింది. శుక్రవారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆప్‌కు 138 మంది సభ్యుల ఓట్లు పడ్డాయి. ఐదుగురు బీజేపీ సభ్యులు ఆప్‌కి క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో​ తామే గెలిచామని ఆప్‌ నేతలు చెబుతున్నా.. బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×