E-Paper
Advertisement

Bharat Bandh: ప్రజలకు అలర్ట్.. గురువారం భారత్ బంద్.. ఆ రంగాలపై ప్రభావం, తెరిచి ఉండేవి

Bharat Bandh: ప్రజలకు అలర్ట్.. గురువారం భారత్ బంద్..  ఆ రంగాలపై ప్రభావం,  తెరిచి ఉండేవి
Advertisement

Bharat Bandh: కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా గురువారం భారత్ బంద్‌కు పిలుపు నిచ్చింది కార్మిక లోకం. రైతు సంఘాల మద్దతుతో పలు కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక రంగాలను ప్రభావితం చేయనుంది.  అనేక రాష్ట్రాల్లో రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

ప్రజలకు అలర్ట్.. గురువారం భారత్ బంద్

Advertisement

ముఖ్యంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు, రవాణా సేవలు, ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభావం చూపుతుంది. గడిచిన దశాబ్దమున్నర తర్వాత ఈ స్థాయిలో అన్ని సంఘాలు మద్దతు ఇవ్వడం ఇదే తొలిసారిగా చెబుతున్నాయి కార్మిక సంఘాలు. కార్మిక సంఘాలకు రైతు సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఈ బంద్ కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రధాన కార్మిక సంఘాలు, వామపక్ష అనుబంధ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. నిరసనలో 30 కోట్లకు పైగా కార్మికులు పాల్గొనే అవకాశం ఉందని కార్మిక లోకం ఓ అంచనా. పది కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఉమ్మడి వేదిక. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మికుల రక్షణ బలహీనపరుస్తుందని, ఉద్యోగ భద్రతను తగ్గిస్తుందని వారు భావిస్తున్నారు.

Advertisement

ఆ రంగాలపై ప్రభావం, తెరిచి ఉండేవి అవే

కార్మికుల హక్కులను పరిరక్షణను నీరు గారుస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులను నియమించుకోవడం, తొలగించడంలో యజమానులకు ఎక్కువ వెసులుబాటును కొత్త చట్టం కల్పిస్తోందని యూనియన్ ప్రతినిధుల మాట. నిరసనలో పాల్గొన్న ప్రధాన కార్మిక సంఘాల్లో CITU, AITUC, INTUC, HMS, AICCTU, LPF, UTUC వంటివి ఉన్నాయి.

భారత్ బంద్ నేపథ్యంలో వివిధ రంగాలపై ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి. వాటిలో ప్రధాన నగరాల్లో మార్కెట్లు, దుకాణాలు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభావం చూపనుంది. వీటికితోడు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలపై కనిపించనుంది. దీనికితోడు రోడ్డు దిగ్బంధనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం చూపనుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటన లేదు. స్థానిక సంస్థలు బంద్‌కు మద్దతు ఇస్తే అంతరాయం కలిగే అవకాశముంది. కేరళ, కర్ణాటక, ఒడిశాతో సహా కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసి వేయబడవచ్చు.

ALSO READ: కేంద్రం కీలక నిర్ణయం.. వందేమాతరం తప్పనిసరి, తొలి ఛాయిస్ కూడా

బంద్ నేపథ్యంలో తెరచి ఉండే విభాగాలేంటి? మెడికల్ షాపులు, ఆసుపత్రులు, ఇతర వైద్య సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కార్యాలయాలు, విమానాశ్రయాలు, ATMలు, ఇతర ముఖ్యమైన సేవలు కంటిన్యూ కానున్నాయి. దేశవ్యాప్తంగా భారత్ బంద్ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు పరిస్థితిని పరిశీలించి అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×