E-Paper
Advertisement

India’s Most Expensive Car : భారత్ లో అత్యంత ఖరీదైన కారు ఇదే.. ఎవరి దగ్గర ఉందో తెలుసా ?

India’s Most Expensive Car : భారత్ లో అత్యంత ఖరీదైన కారు ఇదే.. ఎవరి దగ్గర ఉందో తెలుసా ?
Advertisement

India’s Most Expensive Car : ఇండియాలో అత్యంత ధనవంతులెవరు ? ఎవరి దగ్గర అత్యంత ఖరీదైన కారు ఉంది ? ఎవరి వార్షిక ఆదాయం ఎక్కువ ? ఇలాంటి వాటి గురించి ఆలోచించేటపుడు టక్కున గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. కానీ.. ముఖేష్ అంబానీ దగ్గర ఇండియాలోనే అత్యంత లగ్జరీ కాదు లేదట. మరి ఎవరి దగ్గర ఉంది ? అంటారా. వీ.ఎస్ రెడ్డి అనే వ్యక్తి వద్ద అత్యంత లగ్జరీ కారు ఉందట.

అత్యంత ఖరీదైన ఆటోమొబైల్స్‌ను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన బెంట్లీ, ఆటోమోటివ్ రంగంలో విలాసవంతమైన దీపంలా నిలుస్తోంది. ప్రస్తుతం, భారతదేశంలో అత్యంత విలాసవంతమైన లగ్జరీ కారు బెంట్లీ ముల్సాన్ EWB సెంటెనరీ ఎడిషన్. ఈ స్పెషల్ ఎడిషన్ ఖరీదు రూ.14 కోట్లు. ఈ కారు ఇటీవల బెంగళూరు రోడ్లపై కనిపించింది. ఈ కారెవరిదా అని ఆరా తీస్తే.. భారతదేశంలోని అతిపెద్ద మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీలలో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.ఎస్.రెడ్డి ది అని తెలిసింది.

Advertisement

చిన్నప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని కార్లను సేకరించాలని ఆయన కల అని వీసీ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బెంట్లీ కారును తాజ్ మహల్ ఆఫ్ కార్స్ గా పోల్చారు. బెంట్లీ.. 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్ ఎడిషన్ ను రూపొందించారు. కేవలం 100 ఎడిషన్లు తయారు చేయగా.. అందులో ఒకటి వీఎస్ రెడ్డి వద్ద ఉంది. ఈ కారుకు ఎక్స్ టెండెడ్ వీల్ బేస్ ఉంది. అలాగే వెనుక సీటులో కూర్చునేందుకు విలాసవంతంగా ఉంటుంది. సెంటెనరీ గోల్డ్, సెంటెనరీ, బ్లాక్, సెంటెనరీ వైట్ కలర్స్ లో ఈ కార్లను తయారు చేశారు.

సెంటెనరీ ఎడిషన్ ప్రత్యేకంగా శతాబ్ది బ్యాడ్జిని కలిగి ఉంది. ఇందులో గ్రిల్ బ్యాడ్జ్, వీల్ సెంటర్ క్యాప్స్, ట్రెడ్ ప్లేట్ లు ఉన్నాయి. కారు లోపల సీట్లపై పైపింగ్ తో పాటు ప్రత్యేక వెనీర్లు, సెంటెనరీ బ్యాడ్జ్ లు ఉన్నాయి. బెంట్లీ ముల్సాన్ EWB వెనుక సీట్ లో కూర్చునే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పవర్-రిక్లైనింగ్ వెనుక సీట్లు, అరుదైన హైడ్ లెదర్‌లో డైమండ్ క్విల్టింగ్ స్టిచింగ్‌తో అమర్చబడి ఉంటాయి. సెంటర్ కన్సోల్ లో పిక్నిక్ టేబుల్ కూడా ఉంటుంది. వాహనంలో లాంబ్‌వూల్-ఫినిష్డ్ ఫ్లోర్ మ్యాట్‌లు ఉంటాయి. 6.75-లీటర్ V8 ఇంజన్, 506 హార్స్‌పవర్ కలిగి ఉండటంతో పాటు.. 1020 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కలసి, బెంట్లీ ముల్సాన్ EWB కేవలం 5.5 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వరకు స్ప్రింట్ చేయగలదు. గంటకు గరిష్టంగా 296 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కెపాసిటీ కలిగి ఉంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×