E-Paper
Advertisement

Bengaluru woman: వామ్మో.. బెంగళూరు, మహిళ ఎంత నాటకమాడింది.. తస్మాత్ జాగ్రత్త..

Bengaluru woman: వామ్మో.. బెంగళూరు, మహిళ ఎంత నాటకమాడింది.. తస్మాత్ జాగ్రత్త..
Advertisement

Bengaluru woman: కొన్ని తెలుగు సినిమాల్లో ప్రేమ కోసం నటీనటులు నాటక మాడడం చూశాం. కొందరు కావాలనే కారు కిందట వాహనదారుల నుంచి డబ్బులు గుంజుతారు. అలాంటి సీన్ ఒకటి బెంగుళూరులో రిపీట్ అయ్యింది. మహిళను ముందుగానే గమనించిన కారు డ్రైవర్, తన డ్యాష్ బోర్డులో రికార్డు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కూటి కోసం కోటి విద్యలన్నారు. కానీ కనిపిస్తున్న మహిళ అలాంటి ఇలాంటి నాటకం ఆడలేదు. కారు తనను హిట్ కొట్టిందంటూ డ్రామా క్రియేట్ చేసింది. కాకపోతే కారు వాహనదారులు దూరం నుంచి గమనించి ఆమె తతంగం అంతా కారులోని డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డు అయ్యింది.

Advertisement

బెంగుళూరు సిటీ.. అసలే ట్రాఫిక్. రాత్రి వేళ మాత్రమే కాస్త ట్రాఫిక్ తగ్గుతుంది. ఆ సమయంలో వాహనదారులు ఇంటికి స్పీడ్‌గా వెళ్తారు. వాహనదారులను గమనించిన ఓ మహిళ యాక్సిడెంట్ అంటూ నాటకమాడే ప్రయత్నం చేసింది. ఓ వ్యక్తి కారుకు ఎదురుగా వచ్చింది మహిళ.

ALSO READ: ఇండియాలో బిలియనీర్లు.. టాప్‌లో ముంబై, మూడో ప్లేస్‌లో హైదరాబాద్

Advertisement

దూరంగా నుంచి గమనించి ఆ వ్యక్తి.. తన వాహన వేగాన్ని నియంత్రించుకుని పక్క నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. కావాలనే ఆమె వెళ్లి కారును ఢీకొట్టింది. తనకు యాక్సిడెంట్ అయ్యిందంటూ సీన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత అతడి వైపు చూస్తూ మతిస్థిమితం లేని వ్యక్తిగా సైగలు చేసింది.

దీనికి సంబంధించిన వీడియోను వాహనదారుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇలాంటి మహిళలు రోడ్ల మీద తారసపడితే జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తే రోడ్డు మీద వెళ్లవారు డ్రైవర్‌ను తప్పుబడతారు. కావున రోడ్లపై వాహనాలతో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అంటూ సున్నితంగా చెప్పుకొచ్చారు. ఈ తరహా మహిళలతో మరింత జాగ్రత్త. వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెట్ యూజర్స్.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×