E-Paper
Advertisement

Bengaluru: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణం: భార్యాభర్తలు, కుమారుడిపైకి కారు ఎక్కించి హల్‌చల్

Bengaluru: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణం: భార్యాభర్తలు, కుమారుడిపైకి కారు ఎక్కించి హల్‌చల్
Advertisement

Bengaluru:  ఇటీవల తమ కారుకు మైనర్ డాష్ ఇచ్చాడని, ఓ జంట ఉద్దేశ్యపూర్వకంగా సుమారు 5 కిలో మీటర్లు వెంబడించి బైకర్‌ను కారుతో గుద్ది హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 25, 2025 రాత్రి బెంగళూరులోని పుట్టెనహళ్లి (Puttenahalli) ప్రాంతంలో చోటుచేసుకుంది. కారు అద్దాన్ని (side mirror) ద్విచక్ర వాహనం తగలడంతో, కారులో ఉన్న దంపతులు (మనోజ్ కుమార్, ఆర్తీ శర్మ) బైకర్‌ను (దర్శన్) కొంత దూరం వెంబడించి, ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి చంపినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు. అయితే మరుసటి రోజే(అక్టోబర్ 26న) బెంగళూరులో జరిగిన మరో దారుణమైన హిట్ అండ్ రన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా, అత్యంత నిర్లక్ష్యంగా కారు నడుపుతూ.. బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కాగా, వారి కుమారుడు సైతం గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Read Also: Ananthapuram: అనంతపురంలో దారుణం.. భార్యపై అనుమానంతో వేట కొడవలితో నరికి చంపిన భర్త

వివరాల ప్రకారం.. వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సుక్రుత్ గౌడ (23) అనే వ్యక్తి కోడిగెహళ్లిలో నివాసం ఉంటున్నాడు. అక్టోబర్ 26న, బెంగళూరులోని బీఈఎల్ రోడ్డులో రామయ్య ఆసుపత్రి సమీపంలో సుక్రుత్ గౌడ తన రెడ్ కలర్ టాటా కర్వ్ కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చాడు.

Advertisement

అదే సమయంలో, వినీత్ (33), అతని భార్య అంకిత పటేల్ (31) తమ కుమారుడితో కలిసి బైక్‌పై సదాశివనగర్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వైపు వెళ్తున్నారు. వారి బైక్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన సుక్రుత్ గౌడ, కారును ఆపకుండా వెళ్లిపోయాడు.

సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కారు బైక్‌ను గుద్దడంతో భార్యాభర్తలు ఇద్దరూ గాలిలోకి ఎగిరిపడ్డారు. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే బైక్‌ను ఢీకొట్టినట్లు వీడియో ఆధారంగా స్పష్టమవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుక్రుత్ గౌడగా గుర్తించారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×