// // Bengaluru: ఇంట్లోకి వచ్చి.. యువతికి 'అది' చూపించి.. డెలివరీ బాయ్ వికృత చేష్టలు, వీడియో వైరల్ -->
E-Paper
Advertisement

ఇంట్లోకి వచ్చి.. యువతికి ‘అది’ చూపించి.. డెలివరీ బాయ్ వికృత చేష్టలు, వీడియో వైరల్

ఇంట్లోకి వచ్చి.. యువతికి ‘అది’ చూపించి.. డెలివరీ బాయ్ వికృత చేష్టలు, వీడియో వైరల్
Advertisement

Bengaluru: దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలం డెలివరీ బాయ్‌ల వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మరొక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులో ఆ మహిళకు ఎదురైన భయానక అనుభవం అంతా ఇంతా కాదు. చివరకు కన్నీరు పెట్టుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలేం జరిగింది?

బెంగుళూరులో దారుణమైన ఘటన-బెంగళూరు సిటీలో ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. పార్సిల్ డెలివరీ కోసం ఇంటికి వచ్చాడు డెలివరీ ఏజెంట్. ఆ సమయంలో సదరు డెలివరీ బాయ్ ఇంట్లోని టాయిలెట్ ఉపయోగించుకోవాలని కోరాడు. అందుకు మహిళ అందుకు నిరాకరించింది.  సదరు యువతి మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు డెలివరీ ఏజెంట్.

Advertisement

డెలివరీ బాయ్ వికృత చేష్టలు, షాకైన యువతి-అంతేకాదు యువతిపై  అసభ్యకరంగా ప్రవర్తించాడు. పరిస్థితి గమనించిన సదరు యువతి ఈ తతంగాన్ని వీడియో తీసింది. జరిగిన ఘటనను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. షేర్ చేసిన వీడియోలో సదరు యువతి, తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టింది.

ఈ వీడియోలో బాధితులు ఏం చెప్పింది? పార్సిల్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్..  వెళ్లేటప్పుడు టాయిలెట్ ఒకసారి కావాలని అడిగినట్టు సదరు యువతి చెప్పింది. ఆ సమయంలో తాను ఒంటరిగా ఉండడంతో అనుమతి ఇవ్వలేదు. వద్దని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకుండా సదరు వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించినట్టు ఆరోపించింది.

Advertisement

కంటతడి పెడుతూ వివరాలు వెల్లడించి బాధితురాలు-తన ఎదుట డెలివరీ ఏజెంట్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.  వాష్‌రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు మర్మాంగాలను చూపించడంతో షాక్‌‌కు గురయ్యానని తెలిపింది. నా హక్కులను ఉల్లంఘించినట్లు అవమానానికి గురైనట్లు భావించింది ఆ యువతి. సొంత ఇంట్లోనే అభద్రతా భావానికి లోనయ్యానని చెప్పింది.

హద్దులను అతిక్రమించడానికి లేదా నా ఇంట్లోకి బలవంతంగా చొరబడటానికి ఎవరికీ హక్కు లేదని పేర్కొంది.  జరిగిన ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైంది యువతి. తలుపులు మూసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. ఘటన జరిగినప్పుడు భద్రత గురించి ఎలా భయపడిందో గుర్తు చేసుకుంటూ తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ప్రధాన ద్వారం తెరిచి ఉంచినట్టు చెప్పింది బాధిత మహిళ.

ALSO READ  భార్య మరొకరితో..  షాకైన భర్త,  పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు

ఒకవేళ ఏమైనా జరిగితే సహాయం కోసం బయటకు పరుగెత్తవచ్చని భావించినట్టు మనసులోని మాట బయటపెట్టింది. ప్రతిరోజూ మహిళలపై జరుగుతున్న నేరాల గురించి వింటున్నానని తెలిపింది. జరిగిన ఘటన గురించి బాధితురాలు తన అనుభవాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. యువతి పోస్టు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు దృష్టి సారించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని బాధితురాలిని కోరారు పోలీసులు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో డెలివరీ బాయ్ వ్యవహారశైలిపై కొన్ని వివాదాస్పద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో మహిళల్లో ఆందోళన మరింత తీవ్రమైంది.

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×