E-Paper
Advertisement

Female Entrepreneurs : మహిళా ఆంత్రప్రెన్యూర్లకు అదే అడ్డంకి

Female Entrepreneurs : మహిళా ఆంత్రప్రెన్యూర్లకు అదే అడ్డంకి
Advertisement
Female Entrepreneurs

Female Entrepreneurs : పురుషులతో పోలిస్తే మహిళా ఆంత్రప్రెన్యూర్లకు కుటుంబ నిబద్ధత, కొవిడ్ సమయం ప్రతిబంధకాలయ్యాయి. 49 దేశాలు, టెరీటరీల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం సుస్పష్టమైంది. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో 18% మహిళలు బిజినెస్ కార్యకలాపాల నుంచి వైదొలగాల్సి వచ్చింది.

అదే పురుషుల విషయానికి వస్తే 12.6 శాతం మందిపైనే ఆ ప్రభావం ఉంది. కొవిడ్ కారణాలతో 2022లో 20% మహిళా వ్యవస్థాపకుల సారథ్యంలోని బిజినెస్ తగ్గడమో లేదా అమ్మడమో జరిగింది. ఈ విషయంలో 16.4% మేల్ ఫౌండర్లు మాత్రమే తమ వ్యాపార కార్యకలాపాలకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెట్టారు.

Advertisement

చిన్న వ్యాపార సంస్థలు నిర్వహించిన అతివలపైనే కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయా సంస్థల్లో పనిచేసిన మహిళలు తమ పనికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. కొవిడ్ సమయంలో పిల్లల సంరక్షణ పెద్ద సమస్య కావడంతో.. వర్క్‌ఫోర్స్‌లోని మహిళలు అధికంగా సంఖ్యలో తప్పుకున్నారు. దాంతో పని కుంటుపడి.. ఆయా సంస్థల యాజమాన్యాలపై పరోక్ష ప్రభావం పడింది.

వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల కొలువు/వ్యాపారం నుంచి వైదొలగడమనేది నార్త్ అమెరికాలో సర్వసాధారణం. పురుషులకన్నా మహిళా ఆంత్రప్రెన్యూర్ల సంఖ్య ఉత్తర అమెరికాలో దాదాపు రెట్టింపు అయినందున ఆ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Advertisement

ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అంతే. అన్ని స్థాయుల్లోనూ పురుషుల కన్నా అతివలే అధిక సంఖ్యలో ఉద్యోగం/వ్యాపారం నుంచి వైదొలుగుతున్నారు. పాండమిక్ కారణంగా మహిళలు తాము చేస్తున్న పనికి స్వస్తి చెప్పడం అధికాదాయ దేశాల్లో తక్కువగానూ, మధ్యాదాయ దేశాల్లో ఎక్కువగానూ నమోదైంది.

పురుషులతో పోలిస్తే కుటుంబ, వ్యక్తిగత కారణాలతో కొలువు/వ్యాపారం నుంచి తప్పుకుంటున్న మహిళలు ఉత్తర అమెరికాలో రెండు రెట్లు ఉండగా.. ఆసియా-పసిఫిక్‌లో 1.7 రెట్లు, లాటిన్ అమెరికాలో 1.5 రెట్లు ఉన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×