E-Paper
Advertisement

Lucknow : విధుల్లోనే కుప్పకూలిన బ్యాంక్ ఉద్యోగిని.. అదే కారణమా ?

Lucknow : విధుల్లోనే కుప్పకూలిన బ్యాంక్ ఉద్యోగిని.. అదే కారణమా ?
Advertisement

Employee Fell off in Office: యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో.. 26 ఏళ్ల సీఏ అన్నా సెబాస్టియన్ పని ఒత్తిడి కారణంగా మరణించిన ఘటన మరువకుండానే.. యూపీలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉండగానే ఓ బ్యాంక్ ఉద్యోగిని అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన లక్నోలోని ఓ బ్యాంక్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని గోమతి నగర్లో ఉన్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో సదాఫ్ ఫాతిమా అడిషినల్ డిప్యూటీ వైఎస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. ప్రతిరోజూ లాగే మంగళవారం (సెప్టెంబర్ 24) కూడా విధులకు హాజరైంది. తన పని చేస్తుండగానే.. ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలిపోయారామె. వెంటనే తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఫాతిమా చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. పనిఒత్తిడి కారణంగానే ఆమె మరణించిందని కొందరు వాపోతున్నారు.

Advertisement

Also Read: మహాలక్ష్మి హత్య కేసు నిందితుడిపై వైద్యుల నివేదిక.. అతన్ని కట్టడి చేయకపోతే అంతే సంగతులు ?

యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఈ ఘటనపై X వేదికగా స్పందించారు. పని ఒత్తిడి కారణంగా మరో ఉద్యోగిని ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేసిందన్నారు. దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులపై ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నాయో చెప్పేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×