E-Paper
Advertisement

Karnataka Politics: బళ్లారిలో హై టెన్షన్.. జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన దుండగులు

Karnataka Politics: బళ్లారిలో హై టెన్షన్.. జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన దుండగులు
Advertisement

Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తాజా ఘటనలో.. బళ్లారి శివార్లలో ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన విలాసవంతమైన మోడల్ హౌస్‌ను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. సుమారు రూ. 3 కోట్ల విలువైన ఈ నివాసంపై జరిగిన దాడితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బళ్లారి శివార్లలోని గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఈ మోడల్ హౌస్‌లోకి చొరబడిన దుండగులు మొదట కిటికీలు, తలుపులను ధ్వంసం చేశారు. అనంతరం లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించగా.. ఇంటిలోని ఖరీదైన ఫర్నిచర్, అలంకరణ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

Advertisement

ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని గాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన నేరుగా ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన మండిపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలను సేకరించారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన బళ్లారిలో రాజకీయ సెగను మరింత రాజేసింది.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×