E-Paper
Advertisement

Attack on Parliament: పార్లమెంట్ లో దాడి కేసు.. సూత్రధారి లలిత్ ఝాకి వారం రోజుల కస్టడీ..

Attack on Parliament: పార్లమెంట్ లో దాడి కేసు.. సూత్రధారి లలిత్ ఝాకి వారం రోజుల కస్టడీ..
Advertisement

Attack on Parliament: పార్లమెంట్‌లో స్మోక్ బాంబ్‌ దాడి సూత్రధారి లలిత్‌ ఝా కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లలిత్‌కు వారం రోజుల కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. పార్లమెంట్‌లో దాడి ఘటనలో లలిత్ ఝాను కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అతను కీలక ఆధారాలను ధ్వంసం చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. కీలక సూత్రధారి లలిత్ బయటే ఉండి వీడియోలు రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులకు ఇప్పటికే పోలీసులు 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు.

అయితే ఈ దాడిలో తమ ప్లాన్ అమలు కాకపోతే ప్లాన్-బీ కూడా ఉన్నట్లు మాస్టర్ మైండ్ లలిత్ ఝా విచారణలో తేలింది. ఏదైనా కారణాల వల్ల నీలం, అమోల్‌లు పార్లమెంట్‌కి చేరుకోకుంటే.. మహేష్, కైలాష్ అనే ఇద్దరు వ్యక్తలు పార్లమెంట్ చేరుకుంటారని, స్మోక్‌ బాంబు పేల్చాలని ప్లాన్ చేశారు. అయితే మహేష్, కైలాష్ ఇద్దరు కూడా గురుగ్రామ్ లోని మరో నిందితుడు విశాల్ శర్మ అలియాస్ విక్కీ ఇంటికి చేరుకోలేకపోయారు.

Advertisement

లలిత్ ఈ ఘటన తర్వాత నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు తీసుకొని ప్లాన్ ప్రకారం ఎక్కడైనా దాక్కోవాలని ప్లాన్ చేశాడు. రాజస్థాన్‌లో సాయం చేసే బాధ్యతను మహేష్‌కి అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే లలిత్, మహేష్ ఇద్దరూ గురువారం రాత్రి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×