E-Paper
Advertisement

Assam Train Accident: అస్సాంలో ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్ ప్రెస్.. పట్టాలు తప్పిన ఐదు బోగీలు

Assam Train Accident: అస్సాంలో ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్ ప్రెస్.. పట్టాలు తప్పిన ఐదు బోగీలు
Advertisement

Assam Train Accident: అస్సాంలోని హోజై వద్ద శనివారం ఉదయం సైరంగ్-న్యూదిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు ఏనుగులు మృతి చెందగా, ఒక గున్న ఏనుగు గాయపడింది. ఐదు రైలు బోగీలు పట్టాలు తప్పడంతో.. రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.

సైరంగ్-న్యూదిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొట్టిన ఘటనలో.. ఇంజిన్ సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. న్యూదిల్లీ వెళ్తున్న రైలు శనివారం తెల్లవారుజామున 2.17 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

రైలు సేవలకు అంతరాయం

Advertisement

రైలు బోగీలు పట్టాలు తప్పడంతో అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైలు సేవలపై ప్రభావితమయ్యాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులను ఇతర బోగీలకు ఎక్కించి, గౌహతి రైల్వే స్టేషన్ కు తరలించారు. అక్కడ మరికొన్ని అదనపు కోచ్ లను జత చేయనున్నారు. ఏనుగు కారిడార్ లో ఈ ప్రమాదం జరిగింది. ఏనుగుల గుంపును ట్రాక్‌పై గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లను వేశారు. అయినప్పటికీ, రైలు ఏనుగుల గుంపును ఢీకొని పట్టాలు తప్పింది.

గత ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా రైలు ఢీకొని 79 ఏనుగులు మరణించాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. 2020-21 నుండి 2024-25 వరకు దేశవ్యాప్తంగా 79 ఏనుగులు రైళ్ల ప్రమాదాల్లో మరణించాయని పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్ సభలో తెలిపారు.

Advertisement

Also Read: Special Intensive Revision: ప్రత్యేక సమగ్ర సవరణ.. భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపు

రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు

ఈ తరహా ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఏనుగుల కారిడార్ లో ట్రైన్ స్పీడ్ పై పరిమితి విధించడం, ట్రాక్‌ల దగ్గర ఏనుగులను భూకంప సెన్సార్ ఆధారంగా గుర్తించడం, అండర్‌పాస్‌లు, ర్యాంప్‌లు, ఫెన్సింగ్ నిర్మాణం వంటి పైలట్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఏనుగుల సంరక్షణపై అవగాహన పెంచడానికి 2023-2024లో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రైల్వే అధికారులు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. 3,452 కి.మీ.ల విస్తీర్ణంలోని 127 రైల్వే స్ట్రెచ్‌లలో సర్వే చేసి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రైలు ఢీకొనడాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×