E-Paper
Advertisement

200 మంది డైవర్ల సాహసం.. సముద్ర గర్భంలో మెరిసిన మువ్వన్నెల జెండా.. అండమాన్ దీవుల గిన్నిస్ రికార్డ్

200 మంది డైవర్ల సాహసం.. సముద్ర గర్భంలో మెరిసిన మువ్వన్నెల జెండా..  అండమాన్ దీవుల గిన్నిస్ రికార్డ్
Advertisement

Indian flag Guinness record: అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం శనివారం సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. స్వరాజ్ ద్వీప్ (హేవ్‌లాక్ ఐలాండ్) లోని ప్రపంచ ప్రఖ్యాత రాధానగర్ బీచ్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ నేషనల్ ఫ్లాగ్ (నీటి అడుగున జాతీయ జెండా)ను ఆవిష్కరించారు. సుమారు 60 మీటర్ల పొడవు.. 40 మీటర్ల వెడల్పు కలిగిన ఈ భారీ త్రివర్ణ పతాకాన్ని సముద్ర గర్భంలో విజయవంతంగా ప్రదర్శించడం ద్వారా భారత్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ అద్భుత ఘట్టాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్ అధికారికంగా ధృవీకరించారు.

ఈ క్లిష్టమైన ఆపరేషన్ కోసం అండమాన్ నికోబార్ పోలీసులు, అటవీ శాఖ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ విభాగాలకు చెందిన సుమారు 200 మందికి పైగా శిక్షణ పొందిన డైవర్లు పాల్గొన్నారు. వివిధ డైవింగ్ సెంటర్ల నుంచి వచ్చిన స్కూబా డైవర్లు సమన్వయంతో సముద్రపు లోతుల్లో జెండాను విప్పారు. ఈ బృందంలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు పాల్గొనడం విశేషం. గురుగ్రామ్‌కు చెందిన ఫతే జహాన్ సింగ్ (16).. బెంగళూరుకు చెందిన లావణ్య ఐరా (15).. ఢిల్లీకి చెందిన రణవిజయ్ సింగ్ (14) అతి పిన్న వయస్కులుగా ఈ రికార్డులో భాగస్వాములయ్యారు. నీటి అడుగున జాతీయ పతాకాన్ని పట్టుకోవడం తమకు గర్వకారణమని వారు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

శనివారం ఉదయం 10:35 గంటలకు గిన్నిస్ ప్రతినిధి రికార్డు ధృవీకరణ పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ డి.కె. జోషికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ చంద్ర భూషణ్ కుమార్.. డిజిపి హెచ్.ఎస్. ధలివాల్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్జీ మాట్లాడుతూ.. టీమ్ వర్క్.. అంకితభావంతోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. అండమాన్ దీవులను అడ్వెంచర్ టూరిజం.. మెరైన్ యాక్టివిటీస్‌కు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ ఘనత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అండమాన్ యంత్రాంగం ఇక్కడితో ఆగకుండా ఆదివారం మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైంది. స్వరాజ్ ద్వీపంలోని లైట్‌హౌస్ డైవ్ సైట్ వద్ద ‘టాలెస్ట్ హ్యూమన్ స్టాక్’ (నీటి అడుగున ఎత్తైన మానవ పిరమిడ్) రికార్డును నెలకొల్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించేందుకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: తహసిల్ధార్లకే షాక్.. అయిజలో‌ నకిలీ ధ్రువపత్రాల గుట్టు రట్టు..!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×