E-Paper
Advertisement

Earthquake: కాలిఫోర్నియా టూ కాశ్మీర్.. 12 గంటల్లో వరుస భూకంపాలు.. అసలేం జరుగుతోంది

Earthquake: కాలిఫోర్నియా టూ కాశ్మీర్.. 12 గంటల్లో వరుస భూకంపాలు.. అసలేం జరుగుతోంది
Advertisement

Earthquake: ప్రపంచ దేశాలు ప్రస్తుతం భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. కాశ్మీర్ నుంచి మొదలుకుని కాలిఫోర్నియా వరకు కేవలం 12 గంటల్లోనే భూకంపాలు సంభవించడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ప్రపంచ దేశాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ భూకంపాలు సంభవించాయి. గురు, శుక్రవారాల్లో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. ఈ మేరకు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. రాత్రి 11 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది.

Advertisement

రాజస్థాన్..

రాజస్థాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 1.29 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. అయితే అర్థరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోను గురువారం రాత్రి భూకంపం సంభవించింది.

Advertisement

న్యూయార్క్, న్యూజెర్సీ..

న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీలలో భూకంపాలు సంభవించాయి. న్యూజెర్సీలో భూకంప తీవ్రత 4.0గా నమోదనట్లు భూకంప కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లోను భూమి కంపించిందని.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.

ఉత్తర కాలిఫోర్నియా

ఉత్తర కాలిఫోర్నియాలో శుక్రవారం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 4. 4 తీవ్రతతో సంభవించినట్లు భూకంప కేంద్రం ప్రకటించింది. దాదాపు 7 సార్లు వేర్వేరు సమయాల్లో భూకంపాలు సంభవించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మయన్మార్‌లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×