E-Paper
Advertisement

500 Years Old Hanuman Idol : దొంగలించిన 500 ఏళ్ల హనుమాన్ విగ్రహాన్ని.. భారత్‌కు అప్పగించనున్న అమెరికా

500 Years Old Hanuman Idol : దొంగలించిన 500 ఏళ్ల హనుమాన్ విగ్రహాన్ని.. భారత్‌కు అప్పగించనున్న అమెరికా
Advertisement

500 Years Old Hanuman Idol : భారత్‌కు చెందిన పురాతన హనుమాన్ విగ్రహాన్ని గతంలో ఆస్ట్రేలియ స్వాధీనం చేసుకుంది. 500 ఏళ్లనాటి ఈ విగ్రహాన్ని అమెరికా తిరిగి భారత్‌కు అప్పగించనుంది. అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లో దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింెన్ పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న వివిధ సంస్కృతులకు సహాయాన్ని అందించి వాటిని కాపాడ్డానికి కృషి చేస్తామన్నారు. 500 ఏళ్లనాటి హనుమాన్ విగ్రహాన్ని దొంగలించి ఆక్షన్ సంస్థకు అమ్మివేస్తే.. దాన్ని స్వాధీనం చేసుకొని మళ్లీ భారత్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

గతంలో దక్షిణ భారత దేశంలో ఈ 500ల ఏళ్ల నాటి హనుమాన్ విగ్రహం చోరీకి గురైంది. దొంగలించిన వ్యక్తి.. ఈ విగ్రహాన్ని అమెరికాలోని క్రిస్టినీ ఆక్షన్ సంస్థకు అమ్మివేసారు. తరువాత వేలంపాటలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్వక్తి దీన్ని కొనుగోలు చేశాడు. తరువాత అమెరికా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆ విగ్రహం దొంగలించబడిందని నిర్ధారించుకొని ఆస్ట్రేలియా అధికారులను అప్రమత్తం చేశారు. ఇరు దేశాల సహాకారంతో ఆ పురాతన హనుమాన్ విగ్రహాన్ని అమెరికా విదేశాంగ శాఖ స్వాధీనం చేసుకుంది. త్వరలోనే ఈ విగ్రహాన్ని భారత్‌కు అప్పగించడానికి సన్నద్ధమయింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×