E-Paper
Advertisement

అమర్ నాథ్ యాత్ర 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా!

అమర్ నాథ్ యాత్ర 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా!
Advertisement

Amarnath Yatra 2026 Registration: అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జులై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్న భక్తులు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అమర్‌నాథ్ యాత్ర 2026 రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం అయింది. అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డ్ వెబ్‌సైట్ https://jksasb.nic.in/ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా దేశ వ్యాప్తంగా ఉన్న 550 బ్యాంకు శాఖలలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అమర్‌నాథ్ యాత్రకు ముఖ్యమైన అర్హత.. భక్తుల వయస్సు 13 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. యాత్రకు వెళ్లే వారు ఏప్రిల్ 8, 2026 తర్వాత జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అవసరం.

అమర్‌నాథ్ యాత్ర 2026 అర్హతలు

  • వయో పరిమితి : 13 నుంచి 70 సంవత్సరాల వయస్సు గలవారు మాత్రమే అర్హులు
  • గర్భిణీలు: ఆరు వారాలు దాటిన గర్భిణీలకు అనుమతి లేదు.
  • మెడికల్ సర్టిఫికెట్: ఏప్రిల్ 8, 2026 తర్వాత జారీ చేసి ఆరోగ్య ధృవీకరణ పత్రం అవసరం

అమర్‌నాథ్ యాత్రకు దరఖాస్తు విధానం

భక్తులు అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డ్ (SASB) వెబ్‌సైట్ https://jksasb.nic.in/ ద్వారా యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ లో నమోదు చేసుకునేవారు SBI, PNB, ICICI, YES బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా 550 బ్యాంకు శాఖల్లో సంప్రదించాలి. దరఖాస్తు ఫారమ్, మెడికల్ సర్టిఫికెట్ అప్లికేషన్ SASB పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ అనే ప్రాతిపదికన చేస్తారు. యాత్ర ప్రారంభం అయ్యే ఏడు రోజుల ముందు స్లాట్‌లు క్లోజ్ అవుతాయి.

అమర్‌నాథ్ యాత్ర మార్గాలు

Advertisement

అమర్‌నాథ్ గుహకు వెళ్లడానికి ఉన్న రెండు మార్గాలలో ఒకదానిని ఎంచుకోవచ్చు.

1.పహల్గామ్ రూట్(48 కి.మీ): ఇది పొడవైన మార్గం, ఎత్తుపల్లాలు ఉంటాయి. మొదటిసారి యాత్ర చేసేవారికి అనువైనది.
2. బల్తాల్ రూట్ (14 కి.మీ): షార్ట్ రూట్ కానీ నిటారుగా ఉంటుంది. ట్రెక్కింగ్‌ చేసేవారికి అనువైనది.

Advertisement

ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రికులందరికీ ట్రాకింగ్ కార్డులు, రూ. 10 లక్షల ప్రమాద బీమా, బల్తాల్, నున్వాన్, శ్రీనగర్, చందర్‌కోట్‌లలో వసతి సౌకర్యాలు కల్పిస్తారు. పోనీలు, పల్లకీలు, పోర్టర్ల కోసం ప్రీ-పెయిడ్ బుకింగ్ వ్యవస్థలు కూడా అందుబాటులో ఉంటాయి.

Also Read:  జమ్మూకాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర మొదలు.. భక్తులకు భారీ భద్రత

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×