E-Paper
Advertisement

Lok Sabha Elections 2024 : ప్రచారానికి తెర.. రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

Lok Sabha Elections 2024 : ప్రచారానికి తెర.. రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
Advertisement

Second Phase Lok Sabha Elections 2024 : రెండో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం (ఏప్రిల్ 24)తో తెరపడింది. శుక్రవారం (ఏప్రిల్ 26)న 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. రెండో విడత పోలింగ్ లో విధులు నిర్వహించే సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

రెండోవిడత ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులలో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, మథుర నుంచి హేమమాలిని, తిరువనంతపురం నుంచి శశిథరూర్, రాజీవ్ చంద్రశేఖర్, కోటా నుంచి ఓం బిర్లా, మీరట్ నుంచి అరుణ్ గోవిల్, మండ్య నుంచి కుమారస్వామి వంటి ప్రముఖులున్నారు.

Advertisement

Also Read : ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

కేరళలో 20 లోక్ సభ స్థానాలకు, కర్ణాటకలో 28, రాజస్థాన్ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 7, అస్సాంలో 5, బిహార్ లో 5, ఛత్తీస్ గఢ్ లో 3, పశ్చిమ బెంగాల్ లో 3, మణిపూర్, త్రిపుర, జమ్ము-కశ్మీర్ లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

Advertisement

పోలీసులు, కేంద్ర బలగాలు పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో బిహార్ లో రెండు గంటలు పోలింగ్ సమయాన్ని పెంచింది ఎన్నికల కమిషన్. ఐదు స్థానాలకు అక్కడ పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 6 గంటల వరకూ ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×