E-Paper
Advertisement

Akhilesh Yadav: బీజేపీలో కుర్చీ కోసం కొట్లాట: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: బీజేపీలో కుర్చీ కోసం కొట్లాట:  అఖిలేష్ యాదవ్
Advertisement

Akhilesh Yadav: బీజేపీ ప్రభుత్వం యూపీలో ఆదిత్య నాథ్ సారధ్యంలో అస్థిరతతో సతమతం అవుతోందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లక్నోలో అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటతో కీచులాడుతోందని అన్నారు. కాషయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోందని మండిపడ్డారు. అంతే కాకుండా రాష్ట్ర రాజధాని లక్నోలో గృహాల కూల్చివేత నిర్ణయాలన్ని వాయిదా వేసారని అన్నారు.

యోగి సర్కార్ బలహీనపడుతుందనేది విస్పష్ట సంకేతమని చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేధాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. మరో వైపు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం అయ్యారు.

Advertisement

అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉందని అన్నారు. 2015 ఎన్నికల ఫలితాలు 2027లో కూడా రిపీట్ అవుతాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం యూపీ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు, ఈ నేపధ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించడానికి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: గోడ దూకివచ్చిన ఫ్లైయింగ్ స్క్వాడ్.. అడ్డంగా దొరికిన టీచర్లు

Advertisement

మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలను సమాజ్ వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 35 స్థానాలకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×