E-Paper
Advertisement

Akhilesh Yadav: అయోధ్య లైంగిక వేధింపుల ఘటనపై బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: అయోధ్య లైంగిక వేధింపుల ఘటనపై బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్
Advertisement

Akhilesh Yadav:అయోధ్యలో బాలికపై సాముహిక లైంగిక దాడి కేసులో బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు కుట్ర రాజకీయాలకు తెరలేపాలని బీజేపీ కోరుకుంటుందని తెలిపారు. తొలి నుంచి సోషలిస్టులు ముఖ్యంగా ముస్లింల పట్ల బీజేపీ వ్యవహారశైలి అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.

ఒక యోగి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకుంటే ఆయన యోగి కాలేరని తెలిపారు. ఇక ఈ ఘటనపై అఖిలేష్ గతంలోనే యోగి సర్కార్‌పై మండిపడ్డారు. సాముహిక లైంగిక దాడిలో బాధితురాలికి రక్షణ కల్పించేలా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని అఖిలేష్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసును బీజేపీ నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బాలిక జీవితాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Advertisement

Also Read: సినిమా స్టయిల్‌లో.. 60 కిలోమీటర్ల భారీ ఛేజింగ్, సీఈఓ అరెస్ట్

అంతే కాకుండా కేసు సున్నితత్వం దృష్ట్యా కోర్టు పర్యవేక్షణలో బాలికకు పూర్తి భద్రత కల్పించాలని న్యాయస్థానాన్ని తాను కోరుతున్నానని ఎక్స్ వేధికగా పోస్టు చేశారు. అయోధ్యలో ఇటీవల 12 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి జులై 30 వ తేదీన బేకరీ యజమాని మొయిద్ ఖాన్‌తో పాటు ఉద్యోగి రాజు ఖాన్‌లను పురకలందర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. కాగా నిందితులు ఎస్పీ నేతలు, కార్యకర్తలు కావడంతో వారిని కాపాడేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని కాషాయ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×