E-Paper
Advertisement

Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో టెక్నికల్ ఎర్రర్! గంటసేపు గాల్లోనే..

Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో టెక్నికల్ ఎర్రర్! గంటసేపు గాల్లోనే..
Advertisement

Air India Flight: మరో ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులను వణికించింది. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన AI-119 ఫ్లైట్‌ బుధవారం ఉదయం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది.

ముంబై నుంచి బయల్దేరింది విమానం.. కాసేపటకే టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దాంతో సముద్రంపైనే ప్లైట్ గంటకు పైగా చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తిందంటూ ఫైలెట్స్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో విమానంలో ప్రయాణికులంతా ఒక్కసారిగా హడలిపోయారు. వారికి ఏం జరుగుతుందో తెలీక..సేఫ్‌గా ల్యాండ్ అవుతుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని విమానంలోనే కూర్చున్నారు ప్రయాణికులు.. కానీ కొద్దిసేపటి తర్వాత తిరిగి ముంబైలో సేఫ్‌గా ల్యాండింగ్ చేయడంతో.. ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక మరికొంత ప్రయాణికులను ఇతర ఫ్లైట్‌లలో అడ్జెస్ట్ చేసి వారి గమ్య స్థానాలకు పంపించడం జరిగింది.

Advertisement

విమానం రన్‌వే పై దిగిన వెంటనే సాంకేతిక నిపుణుల బృందం పరిశీలన మొదలుపెట్టింది. నివేదికల ప్రకారం ఇంజిన్ సెన్సార్‌లో లోపం తలెత్తినట్లు భావిస్తున్నారు. దాంతో ఆటోపైలట్ వ్యవస్థ అసాధారణంగా పనిచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి సాంకేతిక నివేదిక రాకపోవడంతో స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదు.

ఈ సంఘటనతో ఎయిర్ ఇండియా విమానాల భద్రతా లోపాలపై మళ్లీ చర్చ మొదలైంది. గత కొద్ది నెలలుగా ఆ సంస్థకు చెందిన పలు అంతర్జాతీయ ఫ్లైట్లలో సాంకేతిక సమస్యలు నమోదవుతున్నాయి.

Advertisement

Also Read: ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ డ్రెస్.. దీని ఖరీదు ఎంతంటే..

ఈ తరహా సాంకేతిక సమస్యలతో ప్రయాణికులలో భయాందోళన పెరుగుతున్నదని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా.. తగిన జాగ్రత్తలు చేపడతామని హామీ ఇచ్చింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×