E-Paper
Advertisement

కేరళం కొత్త సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు.. ఎమ్మెల్యేల ఓపీనియన్ తీసుకుంటున్న పరిశీలకులు, ఆయన వైపే

కేరళం కొత్త సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు.. ఎమ్మెల్యేల ఓపీనియన్ తీసుకుంటున్న పరిశీలకులు, ఆయన వైపే
Advertisement

Keralam Politics: కేరళం కొత్త సీఎం ఎవరు? ముఖ్యమంత్రి పీఠం కోసం ముగ్గురు సీనియర్ నేతలు రేసులో ఉన్నారా? పీఠం ఎవరి సొంతం కానుంది? ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఏఐసీసీ పరిశీలకులు తీసుకున్నారా? మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారా?  అవుననే అంటున్నాయి కేరళం కాంగ్రెస్ వర్గాలు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?

కేరళం కొత్త సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు

Advertisement

కేరళం కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇద్దరు సభ్యుల బృందాన్ని తిరువనంతపురం పంపించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్. ఒక్కో ఎమ్మెల్యేలతో సమావేశమై వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

కొత్త సీఎల్పీ లీడర్ ఎవరైతే బాగుంటుంది? పరిశీలకులతో సమావేశం తర్వాత కేరళం కాంగ్రెస్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు సీఎం రేసులో ఉన్న ఎమ్మెల్యే వీడీ సతీషన్. ఎమ్మెల్యేల నుంచి సేకరించిన అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపనుంది ఏఐసీసీ బృందం.

Advertisement

ఎమ్మెల్యేల ఓపీనియన్ తీసుకుంటున్న పరిశీలకులు

తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేసీ వేణుగోపాల్‌ వైపు 47మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. సతీషన్‌కు వైపు ఏడుగురు, రమేష్ చెన్నితాల వైపు ఏడుగురు మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త సీఎం ఎవరన్న దానిపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రేసులో ముగ్గురు నేతలు కేసీ వేణుగోపాల్, వీడీ సతీషన్, రమేష్ చెన్నితాల కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు. వీరిలో కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. యూపీఏ హయాంలో రమేష్ చెన్నితాల ఓ వెలుగు వెలిగాయి.  ఇక వీడీ సతీషన్ మాత్రం కేరళాకు పరిమితమయ్యారు.  కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తెలియాలంటే ఆదివారం వరకు నేతలు వెయిట్ చేయాల్సిందే.

ALSO READ: తమిళనాడులో సేమ్ సీన్.. విజయ్ ప్రభుత్వంపై గవర్నర్ ఆఫీసు క్లారిటీ, మళ్లీ మొదటికి

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×