E-Paper
Advertisement

బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం గెలుపు తేలిక, ముక్కలైన అన్నాడీఎంకె, టీవీకే ప్రభుత్వానికి ఓ గ్రూప్ మద్దతు

బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం గెలుపు తేలిక, ముక్కలైన అన్నాడీఎంకె, టీవీకే ప్రభుత్వానికి ఓ గ్రూప్ మద్దతు
Advertisement

Tamil Politics: తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం బలపరీక్షకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడి రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం గెలుపు తేలిక

Advertisement

తాజాగా అన్నాడీఎంకే రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఆ పార్టీ సీనియర్‌ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో కొందరు నేతలు సొంత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అంతేకాదు స్వయంగా సీఎం విజయ్‌కు మద్దతు ప్రకటించడం ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపింది.

మంగళవారం ఉదయం చెన్నైలో షణ్ముగం మీడియాతో మాట్లాడారు. కొన్నాళ్లుగా అన్నాడీఎంకే పార్టీకి ఓటములు ఈ మార్పునకు కారణమన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు చెప్పారు. తమిళ రాజకీయాల్లో డీఎంకేకు వ్యతిరేకంగా పుట్టింది అన్నాడీఎంకే పార్టీ అని అన్నారు.

Advertisement

ముక్కలైన అన్నాడీఎంకె, టీవీకే ప్రభుత్వానికి ఓ గ్రూప్ మద్దతు

దాదాపు ఐదు దశాబ్దాలుగా రాజకీయాలు ఆ దిశగా కొనసాగాయన్నారు. ఒకానొక దశలో డీఎంకే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు. అందుకు మెజార్టీ సభ్యులు తిరస్కరించారని, రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే ఉనికే పోతుందని భావించామని, తాము ఎలాంటి పొత్తులో లేమన్నారు.

మా దృష్టంతా అన్నాడీఎంకేను పునరుద్ధరించి బలోపేతం చేయడంపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఏఐఏడీఎంకేను చీల్చే ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు కొట్టేశారు. అలా చేయడం వల్ల ఈపీఎస్‌తో పోరాటానికి దారి తీస్తుందన్నారు.

ALSO READ: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. తమిళనాడులో 717 మద్యం దుకాణాలు బంద్

ఇది ఏఐఏడీఎంకే చీలిక కాదని, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాన కార్యదర్శి తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తామని మరో నేత వేలుమణి అన్నారు. అన్నాడీఎంకె మాజీ సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా సీవీ షణ్ముగం వర్గం పావులు కదుపుతోంది. ఫలితాలు వచ్చిన నుంచి షణ్ముగ వర్గం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు వేలుమణిని శాసనసభాపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ ప్రొటెం స్పీకర్‌కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. 17 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి అన్నాడీఎంకె శాసనసభాపక్షం నేతగా గుర్తించాలని మరో లేఖ ఇచ్చారు. ఈ క్రమంలో రెండాకుల పార్టీలో వర్గ పోరు బయటపడింది. ఈ క్రమంలో బలపరీక్షలో విజయ్ పార్టీ సునాయశంగా విజయం సాధించనుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×