E-Paper
Advertisement

Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi: కృత్రిమ మేధ (AI) విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యావత్ ప్రపంచం ముందు భారతదేశాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. దేశ రాజధాని దిల్లీ (Delhi)లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో చైనా రోబోట్లను మన సొంత రోబోలుగా చిత్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే విషయంపై చైనా మీడియా భారత దేశాన్ని ఎగతాళి చేసిందని పేర్కొన్నారు. ఇది దేశానికే సిగ్గుచేటని ఎక్స్ వేదికగా ఆరోపించారు.

కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఇదే అబద్దంలో మునిగి తేలుతుండటం మరింత సిగ్గుచేటని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారత సమ్మిట్ లో చైనా రోబ్ లను ప్రచారం చేయడాన్ని ఈ సందర్భంగా రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టును రీ-ట్వీట్ చేస్తూ.. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

చైనా రోబోల వాడకం గురించి ప్రస్తావిస్తూ.. అంతముందు కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది. ‘మోదీ ప్రభుత్వం దేశ ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగించింది. వారు ఏఐ సమ్మిట్ అపహాస్యంగా మార్చారు. మనకు ఉన్న డేటా శక్తితో భారత్ ప్రపంచ శక్తిగా ఎదగగలదు’ అంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Advertisement

భారత్ కు చెందిన గల్గోటియా విశ్వవిద్యాలయం (Galgotia University) దిల్లీలోని ఏఐ సమ్మిట్ లో పాల్గొని ‘ఒరియన్’ లేబుల్ కలిగిన ఓ రోబోటిక్ డాగ్ ను ప్రదర్శించింది. అది అచ్చం చైనాకు చెందిన రోబోటిక్ డాగ్ ఆకృతిలో ఉండటంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఇది చైనాలో ఆవిష్కరించబడిన ‘Unitree Go2’ రొబోటిక్ శ్రేణికి చెందినది విమర్శకులు ఆరోపిస్తున్నారు.

Also Read: Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఏఐ సమ్మిట్ ఎక్స్‌పోలో ఉన్న గల్గోటియా యూనివర్శిటీ స్టాల్ ను వెంటనే తొలగించాలని నిర్వాహకులు ఆదేశించినట్లు సమాచారం. తద్వారా ఈ వివాదానికి ముంగింపు పలికించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Also Read: International Fleet Review – 2026: విశాఖలో విశ్వ నౌకల వేడుక.. పాల్గొన్న రాష్ట్రపతి, సీఎం చంద్రబాబు.. 71 యుద్ధ నౌకలతో..

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×