E-Paper
Advertisement

రాజకీయాల్లో ఏజ్ లిమిట్ ఎప్పుడు? సిద్ధరామయ్య కామెంట్స్‌తో ముదిరిన చర్చ!

రాజకీయాల్లో ఏజ్ లిమిట్ ఎప్పుడు? సిద్ధరామయ్య కామెంట్స్‌తో ముదిరిన చర్చ!
Advertisement

Siddaramaiah: పండు ముసలితనం వచ్చేవరకూ అధికారాన్ని పట్టుకుని వేలాడాలా..? రాజకీయాల్లో అవినీతి పెరగడానికి ఏళ్ల తరబడి కొందరి చేతుల్లోనే అధికారం ఉండడమే కారణమా? కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశానికి కావలసింది ముసలి అనుభవమా? లేక దూసుకెళ్లే నవతరమా?

మాజీ సీఎం సిద్ధరామయ్య కామెంట్స్..

Advertisement

ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ ఉంది. పోటీ పరీక్షలు రాయాలంటే ఏజ్ లిమిట్ ఉంది. ఆర్మీలో సర్వీస్‌ లిమిటేషన్ ఉంది. కానీ.. 140 కోట్ల మంది భవిష్యత్తును శాసించే రాజకీయాల్లో మాత్రం ఏజ్ లిమిట్‌తో పనిలేదు. ప్రజల సపోర్ట్ ఉన్నంత కాలం ఫామ్‌లో ఉండొచ్చు. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి. అధికారం కొందరి చేతుల్లో ఏళ్ల తరబడి ఉంటే అవినీతి పెరుగుతుందని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు భారతదేశ రాజకీయ వ్యవస్థకు ఒక వేకప్ కాల్‌లా మారాయి. సీనియర్లు మెంటర్‌షిప్‌ చేస్తూ, పగ్గాలను నవతరానికి అప్పగించినప్పుడే ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అందుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఇవాళ జెన్‌జీ తరం పవర్ బయటపడుతోంది. బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వరకు, అనేక దేశాల్లో యువత సాధిస్తున్న రాజ్యాంగ-రాజకీయ మార్పులు మన డిజిటల్‌ ఇండియాకు అవసరం లేదా?

80 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ ఇండియాను నడిపిస్తారా.?

Advertisement

అనుభవాన్ని కచ్చితంగా గౌరవించాల్సిందే.. కానీ అది కొత్త ఆలోచనలను తొక్కిపెట్టే సాకుగా మారకూడదు. కోడింగ్, AI, ఏవియేషన్ ఏమీ తెలియని 80 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ ఇండియాను నడిపిస్తారా? సీనియర్లు కేవలం మెంటర్స్‌గా ఉంటూ… పాలనా పగ్గాలను నవతరానికి అప్పగించినప్పుడే ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అందుతుందన్నది కొందరి వాదన. పొలిటికల్ పార్టీలు యువతను కేవలం ఫ్లెక్సీలు కట్టడానికో, జెండాలు మోయడానికో పరిమితం చేయకుండా చట్టసభలకు పంపే సాహసం ఎప్పుడు చేస్తాయి?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×