E-Paper
Advertisement

అమెరికా చదువులపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన సీజేపీ ఫౌండర్!

అమెరికా చదువులపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన సీజేపీ ఫౌండర్!
Advertisement

Abhijeet Deepke: అమెరికాలో తన ఉన్నత చదువుల కోసం అయిన ఖర్చులపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తన విద్యార్హతలకు సంబంధించిన ఖర్చుల కోసం తాను కుటుంబంపై ఎలాంటి భారం పడలేదని, పూర్తి బాధ్యతను తానే వహించానని ఆయన స్పష్టం చేశారు.

ఉన్నత చదువులు.. విద్యా రుణం

Advertisement

బోస్టన్ యూనివర్సిటీలో చదివే సమయంలో తనకు లభించిన స్కాలర్‌షిప్, అలాగే తీసుకున్న విద్యా రుణమే తన చదువుకు ప్రధాన ఆధారాలని దీప్కే వివరించారు. ‘నాకు యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ వచ్చింది. దానితో పాటు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని చదువు పూర్తి చేశాను. ఆ రుణాన్ని ప్రస్తుతం క్రమం తప్పకుండా తిరిగిన చెల్లిస్తున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఇటీవల తన కుటుంబ ఆర్థిక వివరాలు, విదేశీ విద్య నిధులపై విచారణ జరపాలని అధికారులను కోరడంపై ఈ విధంగా వివరణ ఇచ్చారు.

పార్టీ నిధులు, విరాళాలపై పారదర్శకత

Advertisement

సీజేపీ ఆర్థిక వ్యవహారాలపై వస్తున్న ప్రశ్నలకూ ఆయన నేరుగా సమాధానమిచ్చారు. భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాల కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారానే ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని తెలిపారు. ప్రజల నుంచి సేకరించే ప్రతి ఒక్క రూపాయికి సంబంధించిన లెక్కను పారదర్శకంగా వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా సాగించిన పెద్ద ఎత్తున నిరసనల్లో, ప్రజలే తమకు ఆహారం, తాగునీరు అందించి మద్దతుగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆర్టీఐ కార్యకర్తపై సీజేపీ విమర్శలు

మరోవైపు, సీజేపీ ప్రతినిధి వైష్ణవి గౌర్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఒక వ్యక్తి వ్యక్తిగత చదువుల ఖర్చులపై పనిగట్టుకుని ప్రశ్నలు లేవనెత్తుతున్న ఆర్టీఐ కార్యకర్త, వ్యవస్థలో జరుగుతున్న ఇతర నిధుల దుర్వినియోగం, అక్రమాలపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వారి వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: చిట్టీల పేరిట భారీ మోసం.. అమీన్‌పూర్‌లో రూ.2 కోట్లతో రాత్రికి రాత్రే దంపతులు పరార్!

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×