E-Paper
Advertisement

Ram Mandir : బాల రాముడికి ముస్లిం కుటుంబం కానుక..!

Ram Mandir : బాల రాముడికి ముస్లిం కుటుంబం కానుక..!
Advertisement
Ram Mandir

Ram Mandir : మరికొన్ని గంటల్లో అయోధ్య రామాలయంలో బాలరాముడు కొలువుదీరబోతున్న వేళ.. దేశ, విదేశాల నుంచి ఎవరికి వారు తమకు తోచిన కానుకలను అయోధ్య నగరానికి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిభిత్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కూడా ఒక అరుదైన కానుకను రామయ్యను పంపింది.

ఫిలిబిత్‌కు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు నవాబ్‌ అహ్మద్‌, తన భార్య హీనా ఫర్వీన్‌, కుమారుడి, మరికొందరు మిత్రులతో కలిసి రూపొందించిన 21.6 అడుగుల పొడవైన ఓ భారీ వేణువును వారు రామయ్యకు కానుకగా పంపనున్నారు. ఈమేరకు దానిని అయోధ్యకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

నవాబ్ కుటుంబం దశాబ్దాల కాలంగా వేణువుల తయారీలో ఉంది. 2021లో 16 అడుగుల పొడవైన వేణువును తయారు చేయగా, అప్పట్లో అది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. తాజాగా దానికంటే పెద్దదైన 21.6 అడుగుల వేణువును వీరు తయారుచేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలువనున్నది. జనవరి 26న ఈ వేణువును అయోధ్య ఆలయానికి తరలించనున్నారు.

ఈ వేణువు వ్యాసం 3.5 అంగుళాలు. ఈ వేణువును తయారు చేయడానికి పది రోజులు పట్టిందని, దీనిని రెండు వైపుల నుంచీ వాయించవచ్చని నవాబ్‌ కుటుంబం తెలిపింది. దీని తయారీకి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చయింది. దీనిని ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక ట్రక్కులో ఊరేగింపులా తరలివెళ్లి, దీనిని రామయ్యకు సమర్పించనున్నట్లు నవాబ్ తెలిపారు.

Advertisement

ఈ భారీ వేణువును అసోంకు చెందిన వెదురుతో చేశారు. 20 ఏళ్ల క్రితమే సేకరించిన వెదురుతో దీనిని తయారు చేశామని, ప్రస్తుతం ఈ రకం వెదురు ఇంకెక్కడా అందుబాటులో లేదని, వేరే అవసరం కోసం ఏనాడో సేకరించిన ఈ అరుదైన వెదురు.. రామయ్యకు బహుమతిగా మారి ఆలయంలో కొలువు తీరుతుందని తాము ఏనాడూ అనుకోలేదని నవాబ్‌ అహ్మద్‌ కుటుంబం సంతోషం వెలిబుచ్చింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×