E-Paper
Advertisement

Manipur : శాంతి స్థాపనే లక్ష్యం.. మణిపూర్ లో ఇండియా బృందం పర్యటన..

Manipur : శాంతి స్థాపనే లక్ష్యం.. మణిపూర్ లో ఇండియా బృందం పర్యటన..
Advertisement

Manipur : తెగల మధ్య ఘర్షలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ప్రతిపక్షాల కూటమి అడుగుపెట్టింది. ఆ రాష్ట్రంలో ఇండియా ఎంపీలు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కొన్నిరోజులుగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులను కలవనున్నారు. కుకీ, మైతేయ్ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడనున్నారు. మణిపూర్ లో జాతుల మధ్య సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకే తాము వచ్చామని కాంగ్రెస్ నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ తెలిపారు.

ఇండియాకు చెందిన 21 మంది సభ్యులతో కూడిన బృందం ఢిల్లీ నుంచి విమానంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు వెళ్లింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎంపీలందరూ హెలీకాప్టర్‌లో చురాచాంద్‌పూర్‌కు వెళ్లనున్నారు. అయితే ఒకటే హెలికాప్టర్ అందుబాటులో ఉంది. దీంతో 2 బృందాలుగా అక్కడికి చేరుకుంటారు. చురాచాంద్ పూర్ లోని పునరావాస కేంద్రాల్లో ఉన్న కుకీ వర్గ ప్రజలతో మాట్లాడతారు. బిష్ణుపూర్‌ జిల్లాలోని మైతేయ్‌ వర్గ ప్రజలు ఆశ్రయం పొందుతున్న పునరావాస కేంద్రానికి రోడ్డు మార్గంలో వెళతారు.

Advertisement

ఆదివారం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉకియ్‌తో విపక్ష కూటిమి ఎంపీలు భేటీ అవుతారు. ఆ రాష్ట్రంలో త్వరగా శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను గవర్నర్ తో చర్చిస్తారు. ఇప్పటికే గవర్నర్ అనుసూయ ఉకియ్ చురాచాంద్‌పూర్‌ లోని పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సమయంలో కొందరు మహిళలు గవర్నర్‌ తమ కష్టాలను చెప్పుకున్నారు. పడుతున్న బాధలు చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. బాధితుల ఆవేదన చూసి గవర్నర్ చలించిపోయారు. కుకీ వర్గానికి చెందిన బాధితులను ఓదార్చారు.

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనతోపాటు, మణిపూర్‌ ఘర్షణల కేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. వీడియో ఘటన కేసులో ఇద్దరు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×