E-Paper
Advertisement

Madhya Pradesh News: కూతురు ప్రేమ పెళ్లి.. పోయిన ఆ తండ్రి పరువు, బతికుండగానే ఏం చేశారంటే

Madhya Pradesh News: కూతురు ప్రేమ పెళ్లి..  పోయిన ఆ తండ్రి పరువు, బతికుండగానే ఏం చేశారంటే
Advertisement

Madhya Pradesh News: అసలే అమ్మాయిలు దొరక్క దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలామంది లవ్ మ్యారేజ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం చాలామందికి నచ్చలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలా చేయడంతో తట్టుకోలేకపోయాడు ఓ తండ్రి. చివరకు తన కూతురు చనిపోయిందని భావించి అంత్యక్రియులు నిర్వహించాడు. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అసలు మేటరేంటి?

మధ్యప్రదేశ్‌లో దారుణం.. 

Advertisement

మధ్యప్రదేశ్‌ విదిశ పరిధిలోని చునావాలి గలి ప్రాంతంలో ఊహించని ఘటన జరిగింది. ఆ ప్రాంతానికి కుష్వాహా కుటుంబానికి చెందిన 23 ఏళ్ల కూతురు కవిత బాగానే చదువుకుంది. ఆ సమయంలో  ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే అబ్బాయి వేరే కమ్యూనిటీకి చెందినవాడు. ఈ విషయం ఇంట్లో వారికి తెలిస్తే తన ప్రేమను అంగీకరించరు.. చివరకు వివాహం చేయరని భావించింది.

ఈ నేపథ్యంలో మూడురోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయింది. కోరుకున్న ప్రియుడ్ని వివాహం చేసుకుంది. ఉన్నట్లుండి కవిత ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పోవడంతో కుష్వాహా కుటుంబసభ్యులు షాకయ్యారు. కూతురు కోసం సమీప ప్రాంతాలలో బంధువులతో కలిసి వెతికారు. కానీ అమ్మాయి గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు.

Advertisement

బతికుండగానే కూతురికి అంత్యక్రియలు

కొన్నిరోజుల తర్వాత ప్రేమికుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకుందని కుటుంబానికి తెలిసింది. ఈ విషయం తెలియగానే కుష్వాహా కుటుంబ సభ్యులు షాకయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతులు ఇలా చేస్తుందని జీర్ణించుకోలేకపోయారు. ఇరుగుపొరుగువారు, కులాల వారు చీటి పోటి మాటలకు తట్టుకోలేకపోయారు. దీన్ని తట్టుకోలేక ఇంట్లో బయట తాళం వేసి లోపల ఉండే పరిస్థితి నెలకొంది.

చివరకు ఈ విషయం తెలిసిన తర్వాత బంధువులు..  కుష్వాహా కుటుంబసభ్యులను సంప్రదించారు. వారిని ఓదార్చడానికి ప్రయత్నించారు. దీన్ని నుంచి బయటపడేందుకు కుష్వాహా ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై బంధువులతో మాట్లాడింది. వేరే కులం వాడ్ని పెళ్లి చేసుకుందన్న కారణంతో కవిత మరణించిందని భావించి, కూతురుకి అంత్యక్రియలు నిర్వహించారు.

శుక్రవారం కుష్వాహా కుటుంబం బంధువులు, కమ్యూనిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పిండితో కూతురు దిష్టిబొమ్మని తయారు చేశారు. ఆ తర్వాత అలంకరించి సంగీతం, ఉత్సవ ఏర్పాట్లతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విదిషలోని అనేక కూడళ్లు గుండా ఈ తతంగం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు దిష్టిబొమ్మను తమ భుజాలపై మోసుకెళ్లారు.

ALSO READ:  రైలులో టికెట్ లేకుండా 300 మంది ప్రయాణికులు, అధికారుల తనిఖీలతో పరుగో పరుగు

శ్మశానానికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు దిష్టిబొమ్మ చితికి నిప్పు పెట్టారు. శాస్త్రోక్తంగా పిండప్రదానం, అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై కవిత సోదరుడు రాజేష్ కుష్వాహా మాట్లాడాడు. ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా కుటుంబం పెంచిందని, గొప్ప ఆశయాలతో చదివించారని తెలిపాడు.

కుటుంబాన్ని విడిచిపెట్టి వారి కలలను చెదరగొట్టిందని అన్నాడు. కవిత తండ్రి రాంబాబు కుష్వాహా కంటతడి పెట్టారు. తన కూతురు నిర్ణయంతో ఫ్యామిలీ పూర్తిగా విచ్ఛిన్నమైందని, తన జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణంగా ఆయన అభివర్ణించాడు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×