E-Paper
Advertisement

Cyclone : బిపోర్‌ జాయ్‌ తుపాన్ తీవ్రరూపం.. గుజరాత్ లో తీరం తాకే అవకాశం..

Cyclone : బిపోర్‌ జాయ్‌ తుపాన్ తీవ్రరూపం.. గుజరాత్ లో తీరం తాకే అవకాశం..
Advertisement

Cyclone : బిపోర్‌ జాయ్‌ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. సౌరాష్ట్ర, కచ్‌లలో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. సోమవారం తీర ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది.

Advertisement

తుపాన్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో అమిత్‌ షా తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుపాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ తుపాన్ పరిస్థితిని సమీక్షిస్తోందని పీఎంవో తెలిపింది. 12 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొంది. మరో 15 స్టాండ్‌బైలో ఉన్నాయని వెల్లడించింది.

గుజరాత్‌ తీరంలోని కచ్‌, పోర్‌బందర్‌, దేవభూమి ద్వారక, జాంనగర్‌, జునాగఢ్‌, మోర్బి జిల్లాల్లో అధికారులను కేంద్రం అప్రమత్తం చేసింది. కచ్‌ తీరానికి ఐఎండీ ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. సముద్ర తీరానికి దగ్గరలో నివశిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

Advertisement

సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేపల వేటపై నిషేధం విధించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. సైన్యం, నౌకా, కోస్టుగార్డు దళాలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. కచ్‌ జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఈ నెల 15న వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు.

మరోవైపు ముంబైకు వర్షాల ముప్పు పొంచి ఉంది. అక్కడ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను రద్దు చేశారు. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×