E-Paper
Advertisement

Borewell : మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన పసివాడు సేఫ్..

Borewell : మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన పసివాడు సేఫ్..
Advertisement

Borewell : అది బీహార్‌లోని నలంద జిల్లా కుల్‌ గ్రామం. ఆ ఊరిలో ఓ మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. 40 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ పసివాడిని రక్షించేందుకు ఆపరేషన్ మొదలుపెట్టాయి. 5 గంటలపాటు తీవ్రంగా శ్రమించాయి. మరోవైపు బాలుడికి ఆక్సిజన్ అందిస్తూ సహాయక చర్యలు కొనసాగించాయి.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జేసీబీ యంత్రాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగించాయి. బోరుబావికి సమాంతరంగా తవ్వకం చేపట్టాయి. ఎన్టీఆర్ఎఫ్ బృందాల శ్రమ, తల్లిదండ్రుల ప్రార్ధనలు ఫలించాయి. బోరుబావిలో పడిన మూడేళ్ల ఆ పసివాడు మృత్యువును జయించాడు.

Advertisement

40 అడుగుల లోతులో పడిన ఆ చిన్నారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. బాలుడు బాగానే ఉన్నాడని ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి రంజిత్‌ కుమార్‌ ప్రకటించారు. చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. తమ బిడ్డ ప్రాణాలతో సురక్షితంగా బయటపడటంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×