E-Paper
Advertisement

Punjab Car Accident: వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు.. 9 మంది మృతి

Punjab Car Accident: వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు.. 9 మంది మృతి
Advertisement

Punjab Car Accident: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. బెజో ఖాడ్‌లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. వీరంతా హిమాచల్ ప్రదేశ్‌లోని ఉన్నా జిల్లా దేహ్లా గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. పంజాబ్‌లోని హిషియార్ పూర్ జిల్లా మహల్‌పూర్‌కు పెళ్లి కోసం వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న మార్గంలో కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారుతో పాటు అందులో ఉన్న వారంతా వరదలో కొట్టకుని పోయారు.

పంజాబ్‌లోని బెజో ఖాడ్‌లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారిలో 8 మంది మృతి చెందారు. కారుతో పాటు వారి మృతదేహాలను బయటకు తీసారు. మరో వ్యక్తి మృత దేహాం కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే కారు ప్రమాదంలో ఓ వ్యక్తి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు అతడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

Advertisement

Also Read: ట్రైన్‌లో మంటలు అంటూ ప్రచారం.. బ్రిడ్జీపై నుంచి దూకేసిన ప్రయాణికులు

ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుఖు, డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్ని హోత్రి సంతాపం వ్యక్తం చేశారు. సీఎం సుఖు.. హిమాచల్ ప్రదేశ్ – పంజాబ్ సరిహద్దు సమీపంలో బలమైన నీటి ప్రవాహం కారణంగా ఉన్నా జిల్లాలోని దేహ్లా గ్రామానికి చెందిన 9 మంది మృతి చెందారు. ఘటన గురించి స్థానిక అధికారులతో మాట్లాడుతున్నాను. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. చని పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాం అని ట్వీట్ చేశారు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×