E-Paper
Advertisement

Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. పాఠశాల ప్రాంగణంలోనే

Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. పాఠశాల ప్రాంగణంలోనే
Advertisement

Heart Attack: ఇప్పుడున్న రోజుల్లో ఎప్పుడు ఏంజరుగుతుందో అర్ధంకానీ పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి వస్తారన్న నమ్మకం రోజురోజుకి తగ్గిపోతుంది. కాలక్రమేణా వెళ్తున్న మార్గంలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ రావడం కామన్ అయిపోయింది. తాజాగా ఎనిమిదేళ్ల బాలిక పాఠశాల ప్రాంగణంలోనే గుండెపోటుతో మరణించింది.

వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో గార్గి అనే విద్యార్ధిని మూడవ తరగతి చదువుతుంది. రోజూవారిలాగే స్కూల్‌కి వచ్చిన బాలిక.. పాఠశాలకు రావడంతోనే ఛాతి నొప్పి అంటూ టీచర్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రిషప్షన్ దగ్గర కుర్చీలో కూర్చున్న గార్గి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గార్గి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిజానికి బాలిక అవస్థకు గురై.. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు.. సీసీ కెమరాలో రికార్డయిన వీడియోలో చూడవచ్చు. ఇక గార్గి సాధారణ వ్యాధులకు మించి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమి లేవని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×