E-Paper
Advertisement

Delhi Republic day Celebrations: ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న సైనికుల విన్యాసాలు, పాక్‌కు చెమటలు పట్టించినవి అవే

Delhi Republic day Celebrations: ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న సైనికుల విన్యాసాలు, పాక్‌కు చెమటలు పట్టించినవి అవే
Advertisement

Delhi Republic day Celebrations: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైనిక విన్యాసాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాటితోపాటు ఆపరేషన్ సింధూర్‌లో వినియోగించిన మిస్సైళ్ల వ్యవస్థ చాలామందిని ఆకట్టుకుంది. ఈసారి ముఖ్యఅతిథులుగా యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ హాజరయ్యారు.

ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర వేడుకలు వైభవంగా సాగాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత శుభాంశు శుక్లాకు అకోశ చక్ర పురస్కార్ ప్రదానం చేశారు రాష్ట్రపతి. వందేమాతరానికి 150 ఏళ్లు ప్రధాన ఇతి వృత్తంతో ఈ వేడుకలు సాగాయి.

అనంతరం సైనిక దళాల కవాతు మొదలైంది. ఈ వేడుకలకు ప్రధాని నరంద్రమోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈసారి ముఖ్య అతిథులుగా యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ హాజరయ్యారు.

Advertisement

సైనికుల విన్యాసాలు, పాక్‌కు చెమటలు పట్టించినవి అవే

ఈసారి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా బాక్ట్రియన్ ఒంటెలు నిలిచాయి. ఆర్మీకి చెందిన ఈ ఒంటెలకు రెండు వీపు మూపురాలు ఉండడం ప్రత్యేకత. అంతేకాదు 15 వేల అడుగుల ఎత్తులో అవలీలగా ప్రయాణించగలవు. మైనస్ డిగ్రీల చలిలో అమాంతంగా 250 కిలోల బరువును మోయగల శక్తి వీటి సొంతం.

ఇక దాయాది దేశ పాకిస్తాన్‌తో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ వార్‌లో ఉపయోగించిన మిస్సైళ్ల వ్యవస్థ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ , ధ్రువ్‌ చాపర్‌ సిందూర్‌ జెండాతో కనిపించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ థీమ్‌తో రూపొందించిన సైన్యం శకటం హైలైట్. త్రివిధ దళాల ఎంత శక్తిమంతంగా ఉంటుందో చాటి చెప్పేలా రెడీ చేశారు.

బ్రహ్మోస్, ఆకాశ్‌ మిస్సైళ్లతోపాటు 300 కిలోమీటర్లు దూరం లక్ష్యాలను ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్‌ లాంఛర్‌ వ్యవస్థ, అర్జున్ యుద్ధ ట్యాంకులు ఈ పరేడ్‌లో ప్రదర్శించారు. వాయు, ఆర్మీ, నేవీ రంగాలకు చెందిన ఆయుధ వ్యవస్థలను ఈ పరేడ్‌లో ప్రదర్శించారు. బ్రహ్మోస్, ఆకాశ్‌ మిస్సైళ్లతోపాటు 300 కిలోమీటర్లు దూరం లక్ష్యాలను ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్‌ లాంఛర్‌ వ్యవస్థ, అర్జున్ యుద్ధ ట్యాంకులు ఈ పరేడ్‌లో ప్రదర్శించారు.

ALSO READ:  గణతంత్ర దినోత్సవానికి కొద్దిగంటల ముందు.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు సీజ్

ఇవేకాకుండా ఈసారి కొత్తగా బెటాలియన్ల ప్రదర్శన జరిగింది. వాటిలో భైరవ్‌- లైట్‌ కమాండో బెటాలియన్, శక్తిబన్‌ రెజిమెంట్, రెండు మూపురాల ఒంటెలు, జన్‌స్కార్‌ గుర్రాలు తొలిసారిగా కవాతులో పాల్గొన్నాయి.
వార్‌లో ధరించే దుస్తులతో అశ్విక దళం మరింత కనువిందు చేసింది. అపాచీతోపాటు ప్రచండ్‌ తేలికపాటి హెలికాప్టర్లు, నాగ్‌ క్షిపణి వ్యవస్థలు, ధనుష్‌ తుపాకులు, డ్రోన్లు పరేడ్‌లో ప్రదర్శనకు ఉంచారు.

పరేడ్ తర్వాత  రాష్ట్రపతి భవన్‌కు తిరుగుపయనమయ్యారు ద్రౌపది ముర్ము.  6,050 మంది సైనికులతో పరేడ్ జరిగింది. అందులో 17 రాష్ట్రాలు,13 కేంద్ర ప్రభుత్వ శకటాలు ప్రదర్శించారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×