E-Paper
Advertisement

7 New Born Babies Died: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు దుర్మరణం!

7 New Born Babies Died: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు దుర్మరణం!
Advertisement

7 New Born Babies Died in New Delhi: తూర్పు ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వివేక్ విహార్ లో ఉన్న శిశు సంరక్షణ ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో.. ఆస్పత్రిలో ఉన్న నవజాత శిశువులు మరణించారు. ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు శిశువులకు గాయాలయ్యాయి. వారందరికీ ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. కొందరు శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఆస్పత్రిలో మంటలు చెలరేగగానే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. కాగా.. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో నవజాత శిశువులు దుర్మరణం చెందడం యావత్ దేశాన్ని కలచివేసింది.

Advertisement

Also Read: 24 మంది సజీవదహనం.. ఇంకా ఎగిసిపడుతున్న మంటలు – వీడియో

ఢిల్లీలోనే మరో ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేసి.. 13 మందిని రక్షించారు. నిన్న గుజరాత్ లోని రాజ్ కేట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×