E-Paper
Advertisement

Surat Building Collapse: సూరత్‌లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురి మృతి..

Surat Building Collapse: సూరత్‌లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురి మృతి..
Advertisement

7 killed in Multi-Storey Building Collapse In Surat: సూరత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సచిన్ ప్రాంతంలోని ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. శిథిలాల్లో పదుల సంఖ్యలో జనాలు చిక్కుకున్నారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. వారితోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికి తీయగా.. ఇంకా చాలా మంది వాటికింద చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద నుంచి ఓ మహిళను కాపాడినట్లు వారు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ ఘటనాస్థలికి చేరుకున్నారు.

Advertisement

ఆరంతుస్తల భవనంలో మొత్తం 30 ఫ్లాట్‌లు ఉన్నాయని.. అందులో కేవలం ఐదింట్లో మాత్రమే నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. కాగా ఈ భవనం 2016-17లో నిర్మించారని పేర్కొన్నారు. గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు భవనం కుప్పకూలిందని ప్రాథమికంగా నిర్దారించారు అధికారులు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×