E-Paper
Advertisement

ట్రెక్కింగ్‌ చేస్తూ.. 500 అడుగుల లోయలో పడ్డ యువకుడు.. వీడియో వైరల్!

ట్రెక్కింగ్‌ చేస్తూ.. 500 అడుగుల లోయలో పడ్డ యువకుడు.. వీడియో వైరల్!
Advertisement

Trekking Accident: కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని కొలుక్కుమళై కొండలు ప్రకృతి అందాలకు, మంత్రముగ్ధులను చేసే సూర్యోదయ దృశ్యాలకు చాలా ప్రసిద్ధి. అయితే, అదే సూర్యోదయాన్ని చూడాలనే ఆత్రుత చెన్నైకి చెందిన 31 ఏళ్ల పర్యాటకుడు కార్తిక్ ప్రాణాల మీదకు తెచ్చింది. స్నేహితులతో కలిసి వచ్చిన కార్తిక్, వ్యూ పాయింట్ వద్ద సూర్యోదయ అందాలను తిలకిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి దాదాపు 500 అడుగుల లోతైన కొండ లోయలోకి పడిపోయాడు.

ప్రమాదానికి దారితీసిన క్షణాలు
ఈ సంఘటన తమిళనాడు పరిధిలోని ‘సింగప్పార’ ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకుంది. కార్తిక్ తన ఐదుగురు స్నేహితుల బృందంతో కలిసి జీప్ సఫారీ ద్వారా ఉదయమే కొండపైకి చేరుకున్నాడు. కొండ చివర నిలబడి ఫోటోలు తీసుకుంటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా కళ్ళు తిరగడంతో సమతుల్యత కోల్పోయి, క్షణాల్లో 500 అడుగుల లోతులో ఉన్న చీకటి లోయలోకి జారిపడ్డాడు. విగతజీవిగా మారిపోయాడేమోనని తోటి మిత్రులు తీవ్ర భయాందోళనకు గురై, వెంటనే అత్యవసర సేవల సిబ్బందికి సమాచారం అందించారు.

Advertisement

5 గంటల ఉత్కంఠ పోరాటం..
సమాచారం అందుకున్న మున్నార్ ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది, కురంగణి పోలీసులతో పాటు స్థానిక కొలుక్కుమళై జీప్ సఫారీ డ్రైవర్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిటారుగా ఉన్న రాళ్ళు, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ సిబ్బంది వెనకడుగు వేయలేదు. త్రాళ్ళ సహాయంతో లోయలోకి దిగి, తీవ్ర గాయాలతో ఉన్న కార్తిక్‌ను గుర్తించారు. దాదాపు 5 గంటల పాటు శ్రమించి అతడిని సురక్షితంగా పైకి తీసుకొచ్చారు.

పర్యాటకులకు హెచ్చరిక
ఈ ఘోర ప్రమాదంలో కార్తిక్ రెండు చేతులు విరగడంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అతనికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మున్నార్ తాలూకా ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఎంతో అందంగా కనిపించే ఇటువంటి పర్యాటక ప్రాంతాల్లో ఫోటోలు, సెల్ఫీల కోసం సాహసాలు చేసే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Advertisement

Also Read: ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్.. జంతర్‌మంతర్ వేదికగా రగిలిన నిరసన జ్వాలలు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×