E-Paper
Advertisement

Alirajpur Family Suicide: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

Alirajpur Family Suicide: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
Advertisement

Alirajpur Family Suicide: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అలీరాజ్‌పూర్ జిల్లాలో ఓ కుటుంబంలోని ఐదురుగు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి వేసుకుని వీరంతా ఆత్మహత్య చేసుకోగా..స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎఫ్ఎస్‌ఎల్ బృందం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌ అలీరాజ్‌పూర్ జిల్లాలోని రౌడీ గ్రామంలో నివాసం ఉంటున్న రాకేష్ సింగ్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. రాకేష్ సింగ్ అతడి భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలను ఇంట్లో వేలాడటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఎవరైనా హత్య చేసి ఆత్మహత్య లాగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా ? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా? ఒక వేళ నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే దానికి గల కారణాలేంటి ? అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలీరాజ్‌పూర్ ఎస్పీ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాల్లో నివసిస్తున్న వారి వాంగ్మూలాలు తీసుకున్నారు.

Also Read: మహారాష్ట్రలో భారీ వర్షాలు, రోడ్డుపైకి మొసలి, కొట్టుకుపోయిన ఫ్యామిలీ

Advertisement

రాకేష్ సింగ్ వ్యవసాయం చేస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం రాకేష్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల మృతదేహాలు ఇంట్లో వేలాడుతూ ఉన్నాయని స్థానికులు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించామని అన్నారు. మృతులది హత్యా, ఆత్మహత్యా అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×